ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఈరోజే తొలిసారిగా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఆ రెండు జట్లే లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్‌కు హార్డిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
తుది జట్లు:
లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మోషిన్ ఖాన్, ఆయుష్ బదోనీ, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
గుజరాత్ టైటాన్స్: హార్డిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఫెర్గూసన్, మహ్మద్ షమీ, వరుణ్ అరోన్