ఏపీలోని మూడు ప్రాంతాల్లో శనివారం నాడు వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రేపటి నుంచి మూడు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు జాబ్ మేళా ఉంటుందన్నారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో శనివారం జాబ్ మేళా ప్రారంభం అవుతుందన్నారు. 35 నెలల్లో వైసీపీ హయాంలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ హయాంలో కేవలం […]
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని.. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని.. దశలవారీగా ఆ పని పూర్తిచేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందని… 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని స్పష్టం చేశారు. అక్కడి వరకు ఉన్నవారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో త్వరగా అయిపోయే పనులు […]
ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఈనెల 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. […]
కడప జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తనకు దేవుడు లాంటి వారని.. అందుకే ఆయన ఆశీస్సుల కోసమే ఇడుపులపాయ సందర్శనకు వచ్చినట్లు వివరించారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని మంత్రి రోజా పేర్కొన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని వైఎస్ఆర్ ఆహ్వానించారని.. కానీ అప్పుడు కుదరలేదని.. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ మీద […]
గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. కరోనా ఆంక్షలు సడలించడం, వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతోంది. గుడ్‌ఫ్రైడే, వీకెండ్ సెలవులు కలిసి రావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి రెండు కిలో మీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17వ […]
టెస్టుల్లో ఇటీవల కాలంలో ఇంగ్లండ్ దారుణ పరాజయాలను చవిచూస్తోంది. యాషెస్ సిరీస్ నుంచి ఆ జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. చివరి 17 టెస్టుల్లో ఇంగ్లండ్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. దీంతో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ నైతిక బాధ్యత వహిస్తూ తన కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఇది తనకు ఎంతో కఠిన నిర్ణయం అయినా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు రూట్ వివరించాడు. అంతేకాకుండా […]
చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చిరకాలం జీవిస్తారని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని.. తమ నాయకుడిని సీఎం జగన్ ఏం పీకలేడని స్పష్టం చేశారు. జగన్ త్వరలోనే జైలుకు పోతాడని.. ఆయన ఉన్న జైలుకు చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి మీకు ముద్ద వేస్తారని కామెంట్ చేశారు. 16 నెలలపాటు జైలులో ఉన్న జగన్ లాంటి చరిత్ర తమకు […]
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కనీలో వేలాడదీశాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఆ ప్లేయర్ పేరును చాహల్ వెల్లడించలేదు. తాజాగా చాహల్ వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చాహల్ సదరు ఆటగాడి పేరు […]
ప్రస్తుతం శ్రీలంకలో రావణ కాష్టంలా రగిలిపోతోంది. ఆ దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ప్రజలంతా కలిసి ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రధాని రాజపక్సే ఇంటి వద్ద ప్రజలు తీవ్ర దాడులకు పాల్పుడుతున్నారు. దీంతో రాజపక్సే ప్రాణాలకు ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రధాని పదవి రాజీనామా చేయాలని అల్టీమేటం కూడా వస్తోంది. దీంతో ప్రధాని రాజపక్సే విదేశాలకు పారిపోయే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు శ్రీలంకలో […]
ఏపీలో కల్తీ మద్యం విక్రయాల వల్ల వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు, అవినీతి చేశారని మండిపడ్డారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి.. ఆయనే జగన్ లావాదేవీలను దగ్గరుండి చూస్తారని విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలో చిన్నచిన్న డిస్టిలరీను తరిమివేసి వాటిని లీజుకు తీసుకుని జే బ్రాండ్ మద్యం తయారు చేసి సుమారు 350 కోట్ల రూపాయలను […]