ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. పీకే ఇచ్చిన నివేదికలో తన ప్రభుత్వ పతనమైందని సీఎం జగన్‌కు తెలిసిందని అందుకే సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. తాను బలంగా ఉన్నాను అనే ప్రయత్నం సీఎం చేస్తున్నారని.. కానీ తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి పీకుడు భాష మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా సీఎం జగన్ ఏం పీకారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి […]
ఐపీఎల్ ప్రసార మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ మేరకు 2023-2027 నాలుగేళ్ల కాలానికి ప్రసార హక్కుల కోసం బీసీసీఐ త్వరలో టెండర్లను పిలవనుంది. అయితే ఈ టెండర్లు పిలవకముందే బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రిపోర్టులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే తొలివారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్ నివేదిక ప్రకారం గత […]
ఏపీలో అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలను ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే విద్యా సంవత్సరానికి చెందిన డబ్బులను జూన్ నెలలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ పథకం లబ్ధిదారులు తమ ఆధార్‌ను గ్రామ, వార్డు సచివాలయాల్లో బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. చైల్డ్ ఇన్ఫో వెబ్‌సైట్‌లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నెంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ నెంబర్‌ను మాత్రమే నమోదు చేయాలని కీలక సూచన […]
హైదరాబాద్ నగరంలో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ అందించారు. శ్రీరామనవమి వేడుకల కారణంగా రెండు రోజుల పాటు నగరంలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ […]
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం దౌర్భాగ్యమంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తిప్పికొట్టారు. ఏపీకి జగన్ లాంటి సీఎం ఉండటమే రాష్ట్రానికి దౌర్భాగ్యమని ఆయన రివర్స్ పంచ్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు చెప్పిన్నట్లు జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే రాష్ట్రానికి మంచిదన్నారు. ప్రధాన మంత్రిని కలిసిన సీఎం జగన్ ఏం అడిగారని ప్రశ్నిస్తే.. తమను, తమ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీలు దూషిస్తున్నారని, తిట్టడమే వారి పనిగా పెట్టుకున్నారని […]
ఆ జంటకు కొత్త వివాహమైంది. దీంతో పెద్దలు వాళ్లిద్దరికీ తొలిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే ఆనందాన్ని పంచాల్సిన తొలిరాత్రి ఆ జంట మధ్య విడాకులకు కారణమైంది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… తమకు కొత్తగా పెళ్లికావడంతో వధూవరులు తొలిరాత్రి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తమ జీవితాల్లో జరిగిన ఘటనల గురించి ఒకరికొకరు వివరించుకున్నారు. ఈ క్రమంలో వధువు చెప్పిన ఓ చేదు నిజం విని వరుడు అవాక్కయ్యాడు. గతంలో తనపై మేనమామ […]
అమెరికాకు చెందిన స్పేస్ X సంస్థ అంతరిక్ష యాత్రలో మరో ఘనత సాధించింది. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోకి స్పేస్ X సంస్థ నలుగురు వ్యోమగాములను పంపింది. వీరు 10రోజుల పాటు ఆ కేంద్రంలో గడపనున్నారు. ఐఎస్ఎస్‌కు పయనమైన మొట్టమొదటి ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ ఇదే. దిగువ భూ కక్ష్యలో వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రల రంగంలో ఇదో మైలురాయి అని నాసా అభివర్ణించింది. అయితే స్పేస్ X సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందినది […]
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండగులు కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లోనే ఆగిపోయింది. రైలు ఆగగానే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ముఖ్యంగా ఎస్ 5, ఎస్ 7, బోగీల్లో ప్రయాణిస్తున్న మహిళల […]
దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని లెక్కించి ఆ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచించింది. అందులో తొలివిడత నిధులను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.879.08 కోట్ల […]
న్యాయస్థానాల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించే తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు వెలువరించే తీర్పులు, వ్యక్తం చేసే అభిప్రాయాలు తమకు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వాలు న్యాయమూర్తులను కించపరుస్తున్నారని.. ఇది దురదృష్టకర పరిణామం అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. గతంలో ప్రైవేట్ పార్టీలు మాత్రమే ఇలా వ్యవహరించేవి అని ఆయన గుర్తుచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ఆమన్‌కుమార్‌పై నమోదైన కేసును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసింది. […]