వీకెండ్ సందర్భంగా ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు టోర్నీలో బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి చెన్నై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. సన్‌రైజర్స్ టీమ్ కూర్పుపై విమర్శలు వస్తుండటంతో ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విలియమ్సన్ […]
బాలయ్య అంటే ఈ రోజుల్లో నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ మన్నవ బాలయ్య అనే సీనియర్ నటులు ఉన్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత ఇలా తన బహుముఖ ప్రజ్ఞతో చిత్రసీమకు సేవలందించారు యమ్.బాలయ్య. అందరివాడుగా, అందరికీ తలలో నాలుకలా ఉంటూ అతి సౌమ్యునిగా పేరొందారు యమ్.బాలయ్య. ‘అమృత ఫిలిమ్స్’ పతాకంపై తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించారు. కొన్నిటికి దర్శకత్వమూ వహించారు. వందలాది చిత్రాలలో కేరెక్టర్ యాక్టర్ గా నటించి మెప్పించారు. మొదట్లో కథానాయకుడే! మన్నవ […]
గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండిన ఘటన కలకలం రేపింది. ఇది సున్నితమైన అంశం కావడం, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆలయంలోని క్యాంటీన్ మూసివేసి, దాన్ని లీజుకు తీసుకున్న నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాంసాహారం బయటే వండారని, దానికి సంబంధించిన రిక్షా ఆలయ ప్రాంగణంలోకి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై గురువారమే నిర్వాహకులకు […]
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది కొంచెం వాహనదారులకు ఊరట ఇచ్చే అంశమే. అయినా గత 16 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.10 పెరిగింది. దీంతో వాహనదారులపై పెనుభారం పడింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.120 దాటింది. మరోవైపు డీజిల్ ధర రూ.107కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను […]
‘అధికారాంతమున చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్’ అని ఓ పద్యంలోని మాటలు అక్షర సత్యాలని ఏపీలో రుజువైంది. పదవిలో ఉన్న వాళ్ళ కోసం జనం పడిగాపులు పడతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల డోర్లు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తుంటారు. సహాయం కోసమో సిఫార్సు కోసమో వచ్చే వాళ్ళతో మంత్రుల ఇళ్ల వద్ద నిత్యం జాతర వాతావరణం కనిపించేది. అదే నాయకుడికి పదవి ఊడిపోతే ఇందుకు పూర్తి రివర్స్ సీన్ కనిపిస్తుంది. సరిగ్గా ఇటువంటి వాతావరణమే ప్రస్తుతం […]
హైదరాబాద్ తుకారాంగేట్ పరిధిలో మహిళా క్రికెటర్ భోగి శ్రావణి నివసిస్తున్న ఇంటిని శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారని.. దీంతో తాము ఇంటిని మరమ్మతులు చేయించినట్లు క్రికెటర్ శ్రావణి వెల్లడించింది. అయినా తమ ఇంటిని అధికారులు పరిశీలించకుండా కూల్చివేశారని ఆమె ఆరోపించింది. ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని వాపోయింది. అయితే ఈ ఘటనలో డిప్యూటీ స్పీకర్ […]
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే కీలుబొమ్మ తరహాలో మంత్రి వర్గాన్ని బలి పశువును చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మంత్రుల నుంచి సీఎం జగన్ ఎందుకు రాజీనామాలు కోరారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి బురదను కడుక్కోవాలంటే ఈ రాజీనామాలు సరిపోవని యనమల వ్యాఖ్యానించారు. విధ్వంసక విధానాలు పాటిస్తోన్న జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి […]
వేసవి కారణంగా దేశమంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అడవుల్లో తీవ్రమైన కార్చిచ్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇంధనం, పర్యావరణం, నీటి వనరుల పర్యవేక్షణ మండలి విడుదల చేసిన అధ్యయనం హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశంలో 30 శాతం జిల్లాల్లో తీవ్ర కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఒడిశాలోని కుందమాల్ జిల్లాలకు కార్చిచ్చుల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది. వరదల నుంచి అనావృష్టికి, అనావృష్టి నుంచి వరదలకు […]
ఏపీలో మంత్రులందరూ రాజీనామాలు చేశారు. దీంతో ఈనెల 11న కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈనెల 10న కొత్త మంత్రుల పేర్లను సీఎం జగన్ గవర్నర్ దగ్గరకు పంపించే అవకాశాలున్నాయి. అయితే కొత్త మంత్రివర్గంలో చేరబోయేది ఎవరు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాల వారీగా ఆశావాహులు తమకే మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో మనం ఓ లుక్కేద్దాం. ★ శ్రీకాకుళం జిల్లా ఔట్: ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు ఆశావహులు: […]
వైద్య రంగంలో అద్భుతం చోటు చేసుకుంది. జీవితంలో ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న ఓ మహిళ భర్త మరణించిన 11 నెలల తర్వాత మాతృత్వం పొందింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013లో వివాహం జరిగింది. అయితే పెళ్లయి ఏడేళ్లు దాటినా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో వీళ్లు వరంగల్‌లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అదే ఏడాది ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం […]