ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత పొదుపుగా బౌలింగ్ చేసింది. అయితే చివర్లో భారీగా పరుగులు సమర్పించుకుంది. దీంతో 20 ఓవర్లకు కోల్‌కతా జట్టు 175/8 స్కోరు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 176 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో నితీష్ రానా(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివర్లో రసెల్(49 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్ […]
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఒంటిమిట్ట చేరుకున్న ఆయన కోదండరామస్వామి ఆలయానికి విచ్చేశారు. తొలుత సంప్రదాయ బట్టల్లో స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా స్వామి వారి కళ్యాణ వేదికకు చేరుకున్నారు. సీఎం జగన్‌కు మంత్రి రోజా, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను […]
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది భారత్‌లో పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదం వినిపిస్తే ఇంకేమైనా ఉంటుందా? కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారత్, అమెరికా సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? ఇరు దేశాల మధ్య స్నేహం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఈ రెండు అంశాల మీద అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమణకు పాల్పడ్డ రష్యా చర్యను భారత్ ఖండించకుండా తటస్థ వైకరి తీసుకోవటం అమెరికా సహా పలు పశ్చిమ దేశాలకు మింగుడుపడటం లేదు. ఎలాగైనా భారత్ మనసు మర్చాలని చూస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల అమెరికా, దాని మిత్ర దేశాల విదేశాంగ […]
ఎవరెస్ట్ శిఖరంపై విషాద ఘటన చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన ఓ పర్వతారోహకుడు ఎవరెస్ట్ శిఖరంపైనే ప్రాణాలు కోల్పోయాడు. 38 ఏళ్ల ఎంజిమి టెన్జీ షెర్పా అనే పర్వతారోహకుడు గతంలో అనేకసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అయితే తాజాగా మరోసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కే క్రమంలో చదునుగా ఉండే ప్రాంతంలో కూర్చున్న అతడు విగతజీవుడై కనిపించాడు. ఎంజిమి షెర్పా ఎవరెస్ట్‌పైనే మరణించడం పలువురు పర్వతారోహకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే షెర్పా ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని తెలుస్తోంది. అతడు ఎత్తయిన […]
క్రికెట్‌లో కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గతంలో గుజరాత్ లయన్స్ జట్టు ఎలా ఆడుతుందో.. ఈ ఏడాది కొత్తగా రంగ ప్రవేశం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా అలానే ఆడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. 2016 సీజన్‌లో గుజరాత్ లయన్స్ జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన 4వ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఓటమి పాలైంది. కట్ చేస్తే.. ఇప్పుడు […]
టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై మంనతాలు జరిపారు. అనంతరం ఆయన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల హైదరాబాద్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన బొజ్జల అనంతరం ఇంటికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు బొజ్జల గోపాలకృష్ణ జన్మదినం. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న చంద్రబాబు ఈ సందర్భంగా బొజ్జల ఇంటికి వెళ్లి […]
ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎక్కడైనా అధికార, విపక్షాల మధ్య వార్ ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం స్వపక్షంలో విపక్షం అన్న పరిస్థితి నెలకొంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ కొందరు నేతల మధ్య వార్‌కు కారణంగా మారింది. నెల్లూరు జిల్లాలో తనకు మరోసారి మంత్రి పదవి రాకపోవడంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కినుక వహించినట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి జిల్లాకు వస్తున్న […]
నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారాన్ని హైకోర్టు చాలా సీరియస్‌గా తీసుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు. అసలు కోర్టులో దొంగలు ఎందుకు పడ్డారు.. దేని కోసం ఈ దొంగతనం జరిగిందో చూడాలన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఏ1గా ఉన్న కేసులో డాక్యుమెంట్లు చోరీ కావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కోర్టులో దొంగతనం అనేది దేశంలో ఇప్పటి వరకు జరగలేదని.. ఇదే తొలిసారి […]
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కొత్త దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి బయటకు వస్తున్న సమయంలో మంత్రిని చూడగానే ఒక్కసారిగా భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో మంత్రి దర్శనానికి రావడంతో అధికారులు గంటల తరబడి స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు మంత్రి కొట్టు సత్యనారాయణ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. […]