కడప జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తనకు దేవుడు లాంటి వారని.. అందుకే ఆయన ఆశీస్సుల కోసమే ఇడుపులపాయ సందర్శనకు వచ్చినట్లు వివరించారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని మంత్రి రోజా పేర్కొన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని వైఎస్ఆర్ ఆహ్వానించారని.. కానీ అప్పుడు కుదరలేదని.. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ మీద అభిమానంతోనే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎమ్మెల్యే కావడం తన కల అని.. అది నెరవేరిందని.. ఇప్పుడు తాను మంత్రిని కూడా అయ్యానని మంత్రి రోజా అన్నారు. పదవులు ఇచ్చేటప్పుడు ఎవరికైనా కులాలు గుర్తుకువస్తాయా అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ కోసం సైనికుడిలా తాను పని చేస్తానని వివరించారు. జగనన్న మంత్రివర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానట్లు తెలిపారు. గతంలో ఒంటిమిట్ట రథోత్సవానికి వచ్చినప్పుడు జగన్‌ను సీఎం చేయాలని వేడుకున్నానని.. తన కోరిక నెరవేర్చినందుకు మరోమారు కళ్యాణోత్సవానికి హాజరవుతున్నట్లు మంత్రి రోజా పేర్కొన్నారు.
ఏపీలో ఆర్థిక పురోగతి సాధించే విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి రోజా స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడానికి జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. ఇకపై తాను జబర్దస్త్ చేయరా అని ఎంతో మంది అడిగారని.. పది మందికి ఉపయోగపడేందుకు ఏదో ఒకటి వదులుకోక తప్పదని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. ఇకపై తాను బుల్లితెరపై కాకుండా రాజకీయాల్లో నవ్వులు పూయిస్తానని ఆమె తెలిపారు.
Nara Lokesh: ‘అమ్మ ఒడి’పై లోకేష్ సెటైర్లు.. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి..!