మీరు జియో ఫైబర్ వాడుతున్నారా.. అయితే జియో ఫైబర్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సంస్థ కొత్త ప్లాన్‌లను ప్రకటించింది. ఈ మేరకు వినియోగదారులు నెలకు రూ.200 అదనంగా చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్‌ను ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చని జియో వెల్లడించింది. ఈ జాబితాలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, ఊట్, సన్ నెక్ట్స్, డిస్కవరీ ప్లస్, ఎరోస్ నౌ, జియో సినిమా వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లు ఉన్నాయి.
జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో రూ.699 ప్లాన్ యూజర్లకు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ పొందవచ్చు. ఈ ప్లాన్ కింద ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ కోసం నెలకు రూ. 100 అదనంగా చెల్లించాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్ కోసం అయితే నెలకు రూ. 200 అదనంగా చెల్లించాలి. ఈ మేరకు 100 ఎంబీపీఎస్‌తో జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ ధర రూ. 799గా ఉండగా.. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్ ధర రూ. 899గా ఉంటుంది.
మరోవైపు రూ.399 ప్లాన్ కింద యూజర్లు 30 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ కోసం నెలకు రూ. 100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు 6 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. అదనంగా రూ. 200 చెల్లించడం ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఇందులో 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
Gold Rates: మగువలకు షాక్.. ఆల్‌టైం గరిష్టానికి చేరిన బంగారం ధరలు