VijayaSaiReddy: నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న మహిళ ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి చెందిన ఓ నైట్ క్లబ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పక్కన ఓ మహిళ ఉండటంపై విమర్శల వర్షం కురుస్తోంది. బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా రాహుల్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి ఆమె రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. సొంతపార్టీలో రచ్చ నడుస్తుంటే ఆయన మాత్రం నైట్ క్లబ్‌లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వీడియోపై వివరణ ఇచ్చేందుకు కాంగ్రెస్ వర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర అంశం వెల్లడించారు. నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పక్కన కనిపించిన మహిళ చైనా దౌత్య సిబ్బంది అని తెలిపారు. ఆమె చైనా రాయబారి హౌ యాంక్వీ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీకి సంబంధించిన వీడియో నేపథ్యంలో చైనా హనీట్రాప్ ఎత్తుగడలు మరోసారి తెరపైకి వచ్చాయని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో ప్రస్తావించారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ అనవసర వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ పార్టీ సొంత నేతే వివాదంలో చిక్కుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
Video of @RahulGandhi partying in a Nepal night club with Chinese diplomats is disturbing as China's honey traps are rising. Hou Yanqi,Chinese Ambassador to Nepal also spotted with him.Congress unnecessarily questions @NarendraModi Ji's Europe trip while its own leader does this!
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 3, 2022
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!