రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కూడా ఈద్ సంబరాలను నిర్వహించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ఈద్ సంబరాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులతో ధోనీ సరదాగా గడపడం కనిపించింది.
కాగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఈ ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన చేసింది. జడేజా సారథ్యంలో 8 మ్యాచ్‌లు ఆడగా ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఉన్నట్టుండి జడేజా కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసి తిరిగి ధోనీకే పగ్గాలు అప్పగించాడు. ధోనీ పగ్గాలు చేపట్టిన తర్వాత సన్‌రైజర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత రీతిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రుతురాజ్ (99) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
EIDhu Namma Kondattam! 💛
Celebrating the festivities the SuperKings way🦁#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/HecryvhKVn— Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2022