విశాఖ జిల్లా సమీక్షా సమావేశంలో ఇంఛార్జి మంత్రి, వైద్యశాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమీక్షా సమావేశంలో 9 అంశాలపై చర్చ జరిగిందన్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రోడ్లు, టూరిజం, నగర అభివృద్ధి, పారిశుధ్యం, వీధి లైట్లు, ఆరోగ్యం, నాడు-నేడు పనులపై సమీక్ష జరిగిందని తెలిపారు. విశాఖ జిల్లా అంటే సీఎం జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం అని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. ఎక్కడ జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో […]
కర్నూలు జిల్లా వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది. దీంతో కర్నూలు మండలం గార్గేపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సుధాకర్, ఇంఛార్జ్ కోట్ల హర్ష వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గార్గేపురంలో కొంత కాలంగా ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఫంక్షన్ విషయంలో వైసీపీ ఎస్సీ వర్గం ప్రశాంత్ కుటుంబంపై వినయ్‌రెడ్డి వర్గం చేయిచేసుకుంది. దీంతో వినయ్ రెడ్డి ఇంటిపై ఎస్సీలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు, […]
రాబోయే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ మీడియా ప్రసార హక్కులను వేలం వేయడం ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరింది. సుమారు రూ.48,390 కోట్లు రావడంపై బీసీసీఐ డబ్బుపై మోజు పడుతోందని.. క్రికెట్ ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బోర్డుకు భారీగా ఆదాయం రావడంపై గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే క్రికెట్ అనేది ఓ మతం అని.. డబ్బుకు […]
టీడీపీ హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడిన అంశంపై వరుసగా రెండోరోజు హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెగాసస్‌పై నియమించిన హౌస్ కమిటీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల సమాచారాన్ని అప్రజాస్వామికంగా తస్కరించిందన్నారు. ఈ అంశంపై నిన్న, ఇవాళ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు తెలిపారు. తమకు కావాల్సిన సమాచారాన్ని అడిగామని.. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జూలై 5న […]
గత కొన్ని నెలలుగా శ్రీలంకలో ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాపారవేత్త శ్రీలంక ప్రజలకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డిని ఇటీవల శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక ప్రజలకు ఆయన రూ.5 లక్షలు పంచుతుండగా సీఐడీ అధికారులు ప్రశ్నించి వదిలేసినట్లు రవీందర్‌రెడ్డి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమాను మహేష్ బాబు అభిమానులు బాగా ఆదరించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వినోదం, సెకండ్ హాఫ్‌లో లేదని సగటు సినిమా ప్రేక్షకుడు పెదవి విరిచినా, కలెక్షన్లను మాత్రం ఈ సినిమా బాగానే రాబట్టింది. దానికి తోడు సినిమా విడుదలైన అంతకు ముందు చిత్రీకరించిన మరో పాటను జత […]
వైసీపీ సర్కారుపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. గృహనిర్మాణంపై మంత్రి జోగి రమేష్ రోగి రమేష్‌లా అసత్యాలు మొరుగుతున్నారని మండిపడ్డారు. గృహనిర్మాణం, ఇళ్ల పట్టాల విషయంలో జగన్ రెడ్డి అండ్ కో కోట్లాది రూపాయలను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో 7.82 లక్షలకు పైగా పేదలకు పక్కా గృహ నిర్మాణం జరిగిందని అసెంబ్లీలో గత మంత్రి రంగనాథరాజు స్వయంగా వెల్లడించారని గుర్తుచేశారు. గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ […]
విశాఖ టీ20లో దక్షిణాఫ్రికా 48 పరుగుల తేడాతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా స్పందించాడు. ఒక్క ఓటమికే తమ జట్టును మార్చాలని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని బవుమా అభిప్రాయపడ్డాడు. తొలి రెండు మ్యాచ్‌లలో భారత బౌలర్లను ఎదుర్కొన్న తరహాలో మూడో మ్యాచ్‌లో చేయలేకపోయిన మాట వాస్తవమని.. భారత స్పిన్నర్లు తమను కట్టడి చేశారని […]
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఏపీలో కొత్త వాహనాలకు రవాణాశాఖ హైసెక్యూరిటీ ప్లేట్లు బిగిస్తోంది. అయితే ఇకపై అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల బిగింపు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నంబర్ ప్లేట్ల ద్వారా అదనంగా రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో 1.5 కోట్ల వాహనాలు ఉండగా అందులో సగం […]
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా (24) తన రికార్డునే తానే బద్దలుకొట్టుకున్నాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో 89.30 మీటర్ల దూరంలో జావెలిన్ త్రో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టుకున్నాడు. నీరజ్ చోప్రా గత ఏడాది మార్చిలో పాటియాలలో 88.07 మీటర్లు విసిరాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాడు. అంతేకాకుండా 2021, ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు […]