Nithiin: నితిన్ ఎమోషనల్ పోస్ట్.. ఏం చెప్పాలో మాటలు రావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నితిన్ సంపాదించుకున్నాడు. జయం సినిమాతో టాలీవుడ్‌లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. అంటే రెండు దశాబ్దాలు. ఓ హీరోకు 20 ఏళ్ల కెరీర్ అంటే ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. హీరో నితిన్‌కు ఈ 20 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. జూన్ 14, 2002న నితిన్ తొలి సినిమా జయం సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నితిన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. రెండో సినిమా దిల్ కూడా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, అ..ఆ, రంగ్‌దే వంటి హిట్లను కూడా నితిన్ సొంతం చేసుకున్నాడు.
కాగా తన సినిమా కెరీర్‌కు 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హీరో నితిన్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు, ఫ్యాన్స్, దర్శక నిర్మాతలు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ముఖ్యంగా ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేసిన దర్శకుడు తేజకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. తేజ తనను ఎంతో నమ్మి వెండితెరకు పరిచయం చేశారన్నాడు. 20 ఏళ్ల క్రితం జయం సినిమాతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టానని… కానీ ఇప్పుడు ఏం చెప్పాలో కూడా తనకు మాటలు రావట్లేదని నితిన్ పేర్కొన్నాడు. తన కెరీర్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ గుర్తుచేసుకున్నాడు. వాళ్లు లేకపోతే ఈ రోజు తాను ఇలా ఉండేవాడిని కాదని నితిన్ అభిప్రాయపడ్డాడు. ఇన్నేళ్లుగా తనను అభిమానిస్తూ తననే ఫాలో అవుతూ చెరగని ప్రేమని అందిస్తున్న అభిమానుల ప్రేమకు అయితే ఎప్పటికీ హృదయాపూర్వకంగా రుణపడి ఉంటానని తెలిపాడు. కాగా నితిన్ ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!

తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు