ఏపీలో రెండు నెలల కిందట జరిగిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రోజాకు మంత్రి పదవి రాకూడదని ఓ సీనియర్ హీరోయిన్ కోరుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కట్ చేస్తే.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే క్రమంగా జబర్దస్త్‌లోని కమెడియన్‌లు ఈ షోను వీడుతున్నారు. ఇటీవల సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌కు దూరం అయ్యాడు. అతడు ఎందుకు జబర్దస్త్‌కు దూరం అయ్యాడో తాజాగా ఓ ప్రోమోలో రాంప్రసాద్ వివరించాడు.
జబర్దస్త్ కంటెస్టెంట్లతో జడ్జ్ ఇంద్రజ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్‌లను సుధీర్ వెళ్లిపోవడానికి గల కారణాలను ఇంద్రజ ప్రశ్నించింది. ‘మీకు ఓ కో టీమ్ లీడర్ ఉండేవాడు. మీరు తొక్కేయడం వల్లే ఆయన జబర్దస్త్‌ను వీడి వెళ్లిపోయాడని అంటున్నారు నిజమేనా?’ అంటూ బుల్లెట్ భాస్కర్‌ను ఇంద్రజ అడిగింది. ‘ఈ ప్రశ్నకు నేను స్పందించకూడదని చాలా రోజులు అనుకున్నా… ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తున్నానంటే వెళ్లిపోయిన ఆయన చాలా పెద్దాయన’ అంటూ బుల్లెట్ భాస్కర్ అంటాడు.
అనంతరం ‘మీరు స్క్రిప్టులు సరిగ్గా రాయకపోవడం వల్లే మీ టీమ్ మెంబర్స్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారా… అది నిజమా’ అంటూ ఇంద్రజ రాంప్రసాద్‌ను అడుగుతుంది. అప్పుడు సీరియస్‌గా ఈ ప్రశ్న అడిగే వాళ్లకు ఇదే నా ఆన్సర్ అంటూ రాంప్రసాద్ ఏదో చెప్తాడు. వాళ్లేం చెప్పారో ప్రోమోలో చూపించలేదు. ప్రోమోలో అసలు మేటర్ ఏంటంటే.. రాంప్రసాద్ కూడా ఇంద్రజను సీరియస్‌గా ఓ ప్రశ్న వేస్తాడు. రోజా గారు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి కాకూడదు అని రోజూ ఆ దేవుడిని ప్రార్ధించారట కదా అని ఇంద్రజను నిలదీస్తాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇంద్రజ తలదించుకున్నట్లు ప్రోమోలో చూపించారు. మరి ఇంద్రజ నిజంగా రోజా మంత్రి కాకూడదని ప్రార్ధించిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ శుక్రవారం (జూన్ 17) ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ చూడాల్సిందే.