ఏపీలో మరోసారి క్యాసినో పాలిటిక్స్ బహిర్గతం అయ్యాయి. గతంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాజాగా కృష్ణా జిల్లాలో మరోసారి క్యాసినో కలకలం రేగింది. ఓ గోవా కంపెనీ గెట్ టుగెదర్ పేరుతో పార్టీ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. కాక్‌టైల్ డిన్నర్, సినీ హీరోయిన్‌ల స్టెప్పులు, సింగర్ల పాటలు, మధురమైన అనుభూతి ఉంటుందని నిర్వాహకులు ప్రచారం చేశారు. దీని కోసం ఆకర్షణీయమైన ఆహ్వాన పత్రాలను పంపారు. భారీ ఏర్పాట్లతో హోరెత్తించారు. కానీ […]
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీనవర్గాలపై దాడేనని ఆరోపించారు. ఈ అంశంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అసలు జగన్‌కు అయ్యన్న కుటుంబం చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి […]
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు గురువారం నాడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 52,265 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 15,556 వద్ద స్థిరపడింది. ఒక దశలో 600 పాయింట్ల వరకు సెన్సెక్స్ లాభపడుతుందని విశ్లేషకులు భావించారు. అటు నిఫ్టీ కూడా 15,600 పాయింట్లను దాటుకుని వెళ్లింది. అయితే చివరకు లాభాల జోరు తగ్గింది. ఈరోజు ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఆటో, […]
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి నేటితో 15 ఏళ్లు పూర్తవుతోంది. 2007, జూన్ 23న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున రోహిత్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రోహిత్ శర్మ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తనకు ఇష్టమైన జెర్సీలో ఈ జర్నీని పూర్తి చేసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. ఇది ఎంతో గొప్ప […]
రాజకీయాలకు తాను దూరంగా ఉన్నా తనకు ఇంకా అనుచర వర్గం ఉందని గల్లా అరుణకుమారి వెల్లడించారు. అయితే వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని.. వాళ్లకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉండాలని చెప్పానని తెలిపారు.
తిరుపతి పర్యటనలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీసీఎల్ గ్రూప్‌కు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీ లిమిటెడ్ (POTPL), డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో టెక్ కంపెనీలకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. టీసీఎల్ కంపెనీ తిరుపతిలో టీవీ ప్యానెళ్లను తయారుచేయనుంది. రూ.1230 కోట్లతో టీసీఎల్ గ్రూప్ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 3,174 మందికి ఉపాధి కలగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ట్రయల్ […]
ఆరోగ్య సేవలో గత 20 ఏళ్లుగా దక్షిణ భారత దేశ ప్రజలకు సేవలు అందిస్తున్న డా.కేర్ హోమియోపతి 54వ బ్రాంచీని హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, డా.కేర్ సీఎండీ ఏఎం రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ యూ.గోవిందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. హోమియోపతి అనేది గొప్ప వైద్య విధానంగా పేదవాళ్లు, కార్మికులు తక్కువ ఖర్చుతో […]
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే ‘ మూవీ ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంతో మంది కష్టపడి తయారు చేస్తారని.. ఎందరో టెక్నీషియన్‌లు సినిమా కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తారని తెలిపాడు. అలాంటి సినిమాను దయచేసి ప్రేక్షకులందరూ థియేటర్లలోనే […]
ఏపీలో సినిమా టికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వమే టిక్కెట్లను విక్రయించనుంది. దీంతో బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి పలకనుంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్‌లైన్‌లో టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు ఏపీఎఫ్‌డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువర్ స్క్రీన్స్ పోర్టల్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ విధానంతో […]
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఆగస్టు 7న ఉదయం 8:07 గంటల నుంచి 8:17 గంటల మధ్య 26 జిల్లాల్లో కల్యాణమస్తు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సామూహిక వివాహ మహోత్సవంలో వధూవరులు ఒక్కటయ్యేందుకు జూలై 1 నుంచి 20 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో […]