ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. భారత్‌లో ఎన్నో మతాలు, ఎన్నో ఆచార వ్యవహారాలు, ఎన్నో సంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు ఎన్నో రకాలుగా పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఇంట్లో పుట్టిన బిడ్డకు కొన్నాళ్ళ తర్వాత గుండు కొట్టిస్తారు. పిల్లలు పుట్టిన ఆరు లేదా తొమ్మిది నెలలకు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి గుండు కొట్టిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు. చిన్నారి మేనమామ మొదటగా కొన్ని వెంట్రుకలు కత్తిరిస్తాడు. అనంతరం వారికి పూర్తి గుండు కొట్టిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తిరుపతి, శ్రీశైలం, పెదకాకాని, మోపిదేవి, యాదాద్రి వంటి పుణ్య క్షేత్రాల్లో ఈ పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే పుణ్యక్షేత్రాల్లోనే చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో చాలా మందికి తెలియదు. చాలా మంది తమ కుటుంబంలో సంప్రదాయంగా వస్తుందని ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇలా చేస్తే దేవుడి ఆశీర్వాదం పిల్లల మీద ఉంటుందని విశ్వసిస్తారు. కానీ పుట్టు వెంట్రుకలు తీయడం వెనుక సైన్స్ దాగి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.
తల్లి తొమ్మిది నెలలు గర్భంలో ఉండి లోకానికి వచ్చాక వారి తలమీద సూక్ష్మక్రిములు ఉంటాయి. తల వెంట్రుకలను ఎంత శుభ్రం చేసినా ఆ క్రిములు మాత్రం తొలగించలేం. షాంపుతో స్నానం చేసినా ఆ క్రిములు పోవు. అందుకే తల మీద వెంట్రుకలను కట్ చేస్తారు. దీంతో ఆ క్రిములు పూర్తిగా వెళ్ళిపోతాయి. పిల్లలకు శిరోముండనం చేస్తే వారి శరీర ఉష్ణోగ్రతలు కూడా నియంత్రణలో ఉంటాయి. గుండు చేయించడం ద్వారా కురుపులు, మొటిమలు, విరేచనాలు వంటి వ్యాధులు పూర్తిగా పిల్లల నుండి తొలగిపోతాయి. హిందూ కుటుంబాల్లో అధికంగా చిన్నారులకు గుండు చేయిస్తుంటారు. ఎందుకంటే తల మీద వెంట్రుకలు లేకపోతే సూర్యరశ్మి తలమీద పిల్లలకు నేరుగా తగిలి మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. సిరుల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. పిల్లలకు గుండు చేస్తే దంతాలు చాలా సులభంగా వస్తాయట. ఇది సైన్స్ ప్రకారం నిజం అని డాక్టర్లు సైతం చెబుతున్నారు. దీంతో చిన్నపిల్లలకు గుండు చేయించడం మూఢనమ్మకం కాదని.. సైన్స్ అని పండితులు అభిప్రాయపడుతున్నారు.