Alia Bhatt: తల్లి కాబోతున్న ఆలియా.. స్వయంగా ప్రకటించిన బాలీవుడ్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ నటులు రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ తమ ప్రేమ బంధాన్ని ఇటీవల పెళ్లిగా మార్చుకున్న సంగతి తెలిసిన విషయమే. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆలియాభట్ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పిక్‌ను ఆలియాభట్ షేర్ చేసింది. తమ బేబీ త్వరలో వస్తోంది అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పిక్‌లో ఆలియా ఆస్పత్రిలోని బెడ్‌పై పడుకుని ఉండగా.. పక్కన టీవీ మానిటర్‌లో లవ్ సింబల్ కనిపిస్తోంది. పక్కనే భర్త రణ్ బీర్ కూడా ఉన్నాడు. దీంతో ఆమె తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లయ్యింది. కాగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వివాహం ఏప్రిల్ 14న ముంబైలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి నటిస్తున్నారు.
ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. కేవలం వారసురాలు అనే ముద్రతో కాకుండా తనదైన నటనతో ఆలియా భట్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అనంతరం డియర్ జిందగీ, హైవే, రాజీ లాంటి సినిమాలు కూడా ఆలియా భట్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆమె నటించిన ఆర్.ఆర్.ఆర్, గంగూబాయి కతియావాడి సినిమాలు కూడా ఘనవిజయం సాధించాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు ఆలియా నిండుదనం తెచ్చిపెట్టింది. ఇక గంగూబాయి కతియావాడి మూవీలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
Also Read
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
- OG 2 Update: పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
- Deepika Padukone: 'రాకా'.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
తాజావార్తలు
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
-
Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!