పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పుష్ప ది రైజ్ మూవీ ఘనవిజయం సాధించడంతో జాతీయ స్థాయిలో బన్నీకి గుర్తింపు వచ్చింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప ది రూల్ మూవీ కోసం జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పుష్ప-1 కంటే పుష్ప-2 సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని దర్శకుడు సుకుమార్ కృతనిశ్చయంతో ఉన్నాడు. పుష్ప ది రూల్ మూవీ ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్తుందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్‌గా నటించనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తాడు.
అయితే పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమాపై సందిగ్థత నెలకొంది. ఇప్పటికే బన్నీ కోసం పలువురు దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నారు. గతంలోనే వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్’ అనే సినిమా ఉంటుందని ప్రకటన వచ్చింది. అంతేకాకుండా కొరటాల శివతోనూ బన్నీ నటిస్తాడని ప్రచారం జరిగింది. వీళ్లిద్దరే కాకుండా ఈ జాబితాలో బోయపాటి శ్రీను, మురుగదాస్ వంటి టాప్ దర్శకులు ఉన్నారు. అయితే వీళ్లల్లో అల్లు అర్జున్ ముందుగా ఎవరికి అవకాశం ఇస్తాడన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప తర్వాత కథల ఎంపికలో బన్నీ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ కథలను మాత్రమే ఎంచుకోవాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. అతడి కొత్త ప్రాజెక్టుపై దసరా నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Chiranjeevi: వేదికపై మారుతితో ‘పక్కా’ డీల్ కుదుర్చుకున్న మెగాస్టార్