> హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. > హైదరాబాద్: ఈరోజు రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లనున్న మోదీ.. ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డు మూసివేత > […]
ఏపీలో ఈనెల 4 నుంచి 12 వరకు జరగనున్న ఈఏపీసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వెల్లడించారు. జూలై 4 నుండి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష లు జరుగుతాయని.. జూలై 11,12 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరుగుతుందని వివరించారు. మొత్తం 122 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని శ్యామలరావు వివరించారు. రెండు సెంటర్లు తెలంగాణలో ఉంటాయని తెలిపారు. ఈఏపీసెట్ పరీక్షల కోసం మొత్తం 3 లక్షల 84 […]
బీజేపీ అనుకూల ప్రకటనలు… కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఆయన స్టైల్. రేవంత్ అంటే వ్యతిరేకత లేదంటారు. కానీ హస్తం పార్టీలో మాత్రం చేరలేదు. చివరికి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఊరించి, ఊరించి కమలం జెండా వైపు మొగ్గిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా బీజేపీనే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య ఉన్న బంధం ఏమిటనేది తెలియదు కానీ, పిసిసి […]
ఏపీ సీఐడీ అడినషల్ డీజీపికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ ఏపీ చీఫ్ అచెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు ఈ ఫోర్జరీ జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ సంతకాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై అనేక ఫిర్యాదులిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని లేఖలో ప్రశ్నించారు. వైసీపీ మద్దతుదారులు జూన్ […]
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మోకాళ్ల నొప్పులకు ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటున్నాడు. తన సొంతూరు రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద కూర్చుని వైద్యం చేసే వందన్ సింగ్ ఖేర్వార్ వద్ద ధోనీ చికిత్స పొందుతున్నాడు. క్యాల్షియం లోపం కారణంగా ధోనీకి మోకాళ్ల నొప్పులు వచ్చినట్లు వైద్యులు తెలియజేశారు. అయితే ఎంతమంది వైద్యం చేసినా ధోనీకి ఉపశమనం లభించలేదు. అయితే తన తల్లిదండ్రుల సూచనతో చెట్టుకింద […]
పార్టీలు మారుతున్నా ఫలితం లేదు. ఎన్ని కండువాలు మార్చినా పదవి దక్కటం లేదు. అన్ని పార్టీలను ఓ రౌండ్ వేసిన ఆయన, చివరికి హస్తం గూటికి చేరారు. ఇక్కడైనా ఉంటారా? లేక మరో గూటికి చేరతారా? పూటకో పార్టీలో చేరితే, కేడర్ పరిస్థితేమిటనే చర్చ నడుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా పనిచేసిన బోడ జనార్థన్ మరోసారి పార్టీ మారారు. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీలు మార్చడంలో ఆయన రికార్డు చెరిగిపోనిదనే టాక్ […]
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్నారు. తన రెండో కుమార్తె హర్షిణి రెడ్డి ప్యారిస్‌లోని ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంటున్న సందర్భంగా తమ కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ఈ పట్టా ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్, ఆయన భార్య భారతి పాల్గొన్నారు. తమ కుమార్తె డిగ్రీ పట్టా అందుకున్న తరుణంలో సీఎం జగన్ […]
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలకు క్రియాశీలక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన వీర మహిళల శిక్షణ తరగతుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని.. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇద్దరితో ప్రారంభమైన టీడీపీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థాయికి వచ్చిందన్నారు. మహిళలు ముందుండి నడిపించకుంటే సమాజంలో మార్పు రాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. […]
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 2వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో చెన్నైలోనే 909 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అటు చెంగల్పట్టులో 352, కాంచీపురంలో 71, తిరువళ్లూరులో 100 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు జిల్లాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని.. లేకుంటే […]