ఏపీలో ఈనెల 4 నుంచి 12 వరకు జరగనున్న ఈఏపీసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వెల్లడించారు. జూలై 4 నుండి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష లు జరుగుతాయని.. జూలై 11,12 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరుగుతుందని వివరించారు. మొత్తం 122 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని శ్యామలరావు వివరించారు. రెండు సెంటర్లు తెలంగాణలో ఉంటాయని తెలిపారు. ఈఏపీసెట్ పరీక్షల కోసం మొత్తం 3 లక్షల 84 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. 14 వేల మంది ఇంకా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని శ్యామలరావు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాప్ హాల్ టికెట్‌తో పాటు ఇస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: Varla Ramaiah: అడిషనల్ డీజీపీకి లేఖ.. అచ్చెన్నాయుడి సంతకం ఫోర్జరీ చేశారు
ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https://cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీఎస్సీహెచ్‌ఈ ఛైర్మన్ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. హాల్ టికెట్‌తో పాటు ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఒక నిమిషం ఆలస్యం అయితే రూల్ ప్రకారం పరీక్ష కేంద్రం లోపలికు అనుమతి ఉండదన్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నారు. మిగతా విద్యార్థులు హాల్ టికెట్, ఐడీ ప్రూఫ్ తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చినా, ఒకరి బదులు ఒకరు పరీక్ష రాసినా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్ లు, మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరాం. విద్యార్థులు మాస్క్ తప్పని సరిగా తెచ్చుకోవాలని.. ఏవైనా సమస్యలు ఉంటే 08554-234311,232248 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.