Water Disputes: ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం.. కేఆర్ఎంబీకి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి జల జగడం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారి ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై లేఖలో అభ్యంతరం తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని ఈ లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. రెండు కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కోరింది.
Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్ మరో ఆవిష్కరణ.. ఇండియాలోనే తొలి డ్రైవర్ లెస్ కారు టెస్ట్ రన్
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
అటు కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌ల ప్రతిపాదనపై ఈఎన్‌సీ మురళీధర్ మరో లేఖ రాశారు. జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తాగునీటి అవసరాలు కాదని ఇతరత్రాలకు తరలింపు సరికాదని తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. పంప్డ్ స్టోరేజ్ స్కీమ్, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదని పేర్కొంది. అనుమతి లేని పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌లను పరిశీలించాలని కేఆర్ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేనివి పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!