Amara Raja: ఫోర్బ్స్ 500 బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితాలో గల్లా కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు టీడీపీ లోక్‌సభ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ ఆధ్వర్యంలోని అమరరాజా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ కంపెనీ తాజాగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా 500 బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితాలో అమరరాజా కంపెనీ నిలిచింది. ఈ విషయాన్ని అమరరాజ గ్రూప్ మంగళవారం స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ప్రజల విలువ తెలిస్తే పోటీలో ముందుంటామన్న విషయాన్ని తాము నమ్ముతామని.. విశ్వాసం, గౌరవం అన్నవే ఆ నమ్మకానికి కారణమని కూడా అమరరాజ గ్రూప్ ట్వీట్‌లో తెలిపింది. ఆ దిశగా పయనించినందుకే తాము ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నామని అభిప్రాయపడింది. ఈ నమ్మకంతోనే మరింత వృద్ధిని సాధిస్తామని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా అమరరాజా కంపెనీ చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం కరకంబాడీలో ఉంది. ఈ సంస్థ అమరాన్ పేరుతో బ్యాటరీలు అమ్మడంలో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అటు అమరరాజా బ్యాటరీస్ గ్రూప్‌కు చెందిన అమరరాజా పవర్ సిస్టమ్స్.. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్‌ను లేహ్, లడాఖ్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) నుంచి పొందినట్లు ఇటీవల అమరరాజా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ARG is one of the top ranking companies in Forbes 500 best employers list.
We believe that if you value people, you can get a competitive advantage. Trust and respect are at the core of that belief, the belief that we can become #BetterTogether.https://t.co/MZqEwGBO2t pic.twitter.com/It2hqCXXIQ
— Amara Raja (@AmaraRaja_Group) July 5, 2022
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!