Andhra Pradesh: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఎంపికైన 165 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం నాడు వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 167 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా 165 పోస్టులను భర్తీ చేసింది. మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది.
Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్ మరో ఆవిష్కరణ.. ఇండియాలోనే తొలి డ్రైవర్ లెస్ కారు టెస్ట్ రన్
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ లో 167 పోస్టులలో డిప్యూటీ కలెక్టర్లు-30, అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్స్-8, డీఎస్పీలు-27, డీఎస్సీ(జైళ్ల శాఖ)-1, డీఎఫ్‌వో-1, అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు-11, ఆర్టీవోలు-5, అసిస్టెంట్ ప్రొహిబిషన్-మల్టీజోన్1 – 06, మల్టీ జోన్ 2-05, ఎంపీడీవోలు-47, జిల్లా రిజిస్ట్రార్లు-01, జిల్లా ఉపాధి కార్యాలయం-02, సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్స్- 01(జోన్-2), 01 (జోన్-3), జిల్లా గిరిజన అధికారి-01, ఎస్సీ సంక్షేమ అధికారి-01, బీసీ సంక్షేమ అధికారి-01, డీపీవో-01, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు-1, ఏపీ వైద్యారోగ్య పరిపాలన శాఖలో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు- మల్టీజోన్1- 06, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2 (జోన్-3), 4 (జోన్-4)
కాగా గ్రూప్-1 పరీక్షల ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని.. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 167 పోస్టుల భర్తీకి లక్షన్నరకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని.. 325 మందిని ఇంటర్వూ వరకు వచ్చారని.. కోర్టు తీర్పుకు లోబడి ఈ ఫలితాలు వర్తిస్తాయని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. 2018 నుంచి ఫలితాల విడుదలలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని.. పరీక్షల నిర్వహణ కోసం టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేశామన్నారు. వచ్చే నెలలనే గ్రూపు1, గ్రూప్ 2 నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ అభ్యర్థులు లేవనెత్తిన అంశాలపై అన్ని అంశాలపై కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లామని.. ఈ మేరకు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా.. ఏపీపీఎస్సీని రాజ్‌భవన్ వివరణ కోరిందన్నారు. పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు అన్ని అంశాలను గవర్నర్ కు వివరించామని.. అభ్యర్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పూర్తి పారదర్శకంగానే మూల్యాంకనం జరిగిందని వివరించారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీపీఎస్సీ యువతకు స్పష్టమైన హామీ ఇస్తుంది.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!