కాకినాడ జిల్లాలో మంగళవారం జరిగిన వైసీపీ ప్లీనరీలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు తాము పెట్టిన చిన్న బచ్చా గాళ్లు అని.. వాళ్లు తమ మీద పెత్తనం చెలాయిస్తున్నారని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వాలంటీర్లను మనమే పెట్టామని.. మీకు నచ్చకపోతే తీసేయండి అంటూ కార్యకర్తలకు సూచించారు. వార్డు సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్‌లోకి తీసుకుని నడిపించాలి.. మిమ్మల్ని ఎవరూ వద్దని చెప్పరు అని కూడా మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.
Read Also: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి
మరోవైపు కొద్దిరోజుల క్రితం మంత్రి అంబటి రాంబాబు సైతం వాలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులు అని వ్యాఖ్యానించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లనే తీసేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. అవసరమైతే వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామన్నారు. ఇలా రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు వాలంటీర్లపై వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అటు గతంలో వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత లేదని.. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులేనా అంటూ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వాలంటీర్లకు ఎటువంటి హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది.