స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు షాకిచ్చింది. ఎస్‌బీఐ పెంచిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హోం, పర్సనల్, కారు లోన్‌లపై చెల్లించే ఈఎంఐలు పెరిగాయి. ఎంసీఎల్‌ఆర్‌ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఎంసీఎల్ఆర్ ప్రకారం వివిధ బ్యాంకుల్లో ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్‌లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. […]
విశాఖ పర్యటనలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ మేరకు 2022-23 సంవత్సరానికి రాష్ట్రంలో సొంత ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో భాగంగా నాలుగో విడతగా దాదాపు 2,61,516 మంది లబ్ధిదారులకు రూ.10వేలు చొప్పున రూ.261.51 కోట్ల ఆర్ధిక సహాయం అందించింది. దీంతో గత నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను […]
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సుమారు 1800 మంది ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు వేసింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం లక్షా 80 వేల మంది ఉద్యోగుల్లో సుమారు ఒక శాతం మందిపై వేటు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతకాలం అనంతరం మైక్రోసాఫ్ట్ పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని నియమించుకోనుంది. కన్సల్టింగ్, కస్టమర్, […]
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గుండె సమస్యతో ఆపదలో ఉన్న ఓ చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి అండగా నిలిచారు. ఉప్పుటూరు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా.. గిరిజన కుటుంబానికి చెందిన చిన్నారి స్నేహకు గుండె సమస్య ఉన్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించి కారు ఏర్పాటు చేసి తన ప్రతినిధిని పంపించి […]
కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనపై దేశంలో ప్రముఖ సర్వే సంస్థ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే (సీఎన్‌ఓఎస్) భారీ సర్వే నిర్వహించింది. ప్రభుత్వ విధానాలు, పాలకుల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించింది. సీఎన్‌వోఎస్ తాజా సర్వే ఫలితాల్లో ప్రధాని మోదీకి గతంలో కంటే ప్రజాదరణ కాస్త పెరిగింది. మోదీ నికర ఆమోదం రేటింగ్ 36 పాయింట్లుగా ఉంది. 54 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారు. 18 […]
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు, తెలుగు క్రికెటర్ ద్వారక రవితేజ అన్నాడు. యూకేలో విరాట్ కోహ్లీని కలిసినట్లు రవితేజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సుమారు ఆరేళ్ల తర్వాత కోహ్లీ, తాను కలుసుకున్నామని.. వెంటనే విరాట్ నన్ను చిరు ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడని రవితేజ వివరించాడు. అండర్-15 […]
ఆకర్షణీయమైన గదులతో ఆతిథ్యం అందించే ఓయో సంస్థ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈనెల 17న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్ష కోసం 18 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఓయో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు తమ హోటళ్లలో 60 శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. అయితే ఇది అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందని ఓయో వెల్లడించింది. ఈ […]
లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంంటే రెండో వన్డేలో విజయం సాధించి తీరాల్సిందే. టీమిండియా మాత్రం రెండో వన్డేలో కూడా రాణించాలని కోరుకుంటోంది. గజ్జల్లో గాయంతో తొలి వన్డేకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ రెండో వన్డేకు కూడా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదని […]
తిరుమల కొండపై టీటీడీ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. నగదు చెల్లింపుల స్థానంలో యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేసే టీటీడీ దేశవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులు జరుగుతున్న వేళ తిరుమలలోనూ యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద భక్తుల వసతి గదుల కేటాయింపును టీటీడీ ఎంచుకుంది. Read Also: Polavaram Flood Effect: పోలవరంపై గోదారి వరద ప్రభావమెంత? వసతి గదుల కేటాయింపు సమయంలో భక్తులు […]