Bihar vs AP: విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టు అరుణాచల్ ప్రదేశ్‌పై రికార్డు విజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో బీహార్ 397 పరుగుల తేడాతో గెలిచి విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది.
ఇక బీహార్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడాడ్డు. వైభవ్ కేవలం 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్ల ధనాధన్ ఇన్నింగ్స్‌తో 190 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న వైభవ్.. మంగళ్ మహ్రూర్ (33)తో కలిసి తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. ఆ తర్వాత పియూష్ సింగ్ (77), అయూష్ లోహరుకా (116), కెప్టెన్ సకిబుల్ గనీ (128*) అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. అరుణాచల్ బౌలర్లలో టీఎన్‌ఆర్ మోహిత్ 2 వికెట్లు, టెచి నేరి 2 వికెట్లు తీశారు. మిబోమ్ మోసు కేవలం 9 ఓవర్లలో 116 పరుగులు ఇచ్చాడు.
Karnataka vs Jharkhand: టార్గెట్ 413.. అయితే ఏం..! థ్రిల్లింగ్ విజయం అందుకున్న కర్ణాటక..
ఇక రికార్డు 575 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ కుప్పకూలింది. 42.1 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ కమ్షా యాంగ్‌ఫో (32*) టాప్ స్కోరర్ కాగా, టెచి దోరియా (28), టెచి నేరి (28) మాత్రమే కాస్త రాణించారు. బీహార్ బౌలర్లలో అకాష్ రాజ్, సూరజ్ కశ్యప్ 3 వికెట్లు తీయగా.. హిమాంశు తివారీ 2 వికెట్లు తీసి అరుణాచల్ బ్యాటింగ్‌ను నేలకూల్చారు.
🚨 World Record – Bihar hammered 574/6 runs against Arunachal Pradesh in Vijay Hazare Trophy 🥶
Vaibhav Suryavanshi – 190(84)
Sakibul Gani – 128*(40)
Ayush Loharuka – 116(56)
Piyush Singh – 77 (66)This is completely harrasment of Arunachal Pradesh😭 pic.twitter.com/BlGHLfY2E0
— Tejash (@Tejashyyyyy) December 24, 2025