Shivaji Press Meet: దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత ప్రకంపనలు సృష్టించాయో తెలిసిందే.. ఈ నేపథ్యంలో శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ముందుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. వేదికపై తాను చేసిన రెండు అనుచితమైన వ్యాఖ్యలపై తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
ఈ విషయంలో నా భార్యకు నేను ముందు క్షమాపణలు చెప్పాను. అసలు ఏ స్టేటస్‌లో ఈ మాటలు మాట్లాడావని అంది. రేపు నా పిల్లలు వాళ్ల ఫ్రెండ్స్ దగ్గర ఇబ్బంది పడకూడదు. రాత్రి పన్నెండు తర్వాత ట్వీట్స్ చిన్మయికి, అనసూయకి ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు, ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, మహిళా కమీషన్‌కు లేఖలు పంపేశారు. నన్ను ఒక్క మాట కూడ అడగలేదు. సుప్రియ మాత్రమే మాట్లాడారు. నేను ఆమెకు సారీ చెప్పాను. తప్పుగా మాట దొర్లిందని చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు.
మనం అందరం బూతులు మాట్లాడుకుంటాం. కానీ స్టేజ్‌పై ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఓ పద్ధతి ఉంటుంది. నేను ఎవరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు. ఇప్పటికీ భూమికతో మాట్లాడుతాను. ఆమెను మేడమ్ అనే పిలుస్తాను. లయను లయమ్మ అంటాను. రంభ, సంఘవిలను గారుతో సంబోధిస్తాను. ఏరోజు ఎవరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు ఇదే మనకు గుదిబండై కూర్చుంటుందని వ్యాఖ్యానించారు.