శ్రావణ మాసం పూజలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. తొలి శ్రావణ మంగళవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మహిళలు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. https://www.youtube.com/watch?v=9Rxk_UKPFuQ
IND Vs WI: సెయింట్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఎట్టకేలకు ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (11) కూడా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (10) కూడా […]
What’s Today: * ఢిల్లీ: పింగళి వెంకయ్య గౌరవార్ధం ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘తిరంగ ఉత్సవ్’ కార్యక్రమం.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘవాల్, మీనాక్షి లేఖి * నేడు పింగళి వెంకయ్య 146వ జయంతి […]
Ambati Rambabu: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సోమవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అయితే తనపై మహిళలు తిరగబడ్డారంటూ కొన్ని మీడియా ఛానళ్లలో రావడంపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ సైట్లలోనూ తనపై ఓ వార్తను పదేపదే ప్రచారం చేశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘గడప గడపకు.. కార్యక్రమంలో అంబటి రాంబాబుపై మహిళలు తిరగబడ్డారు’ అనేది ఆ వార్త సారాంశం […]
5G spectrum auction: వారం పాటు సాగిన 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తంగా రూ.1,50,173 కోట్ల బిడ్లు దాఖలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 10 కోట్ల కనెక్షన్‌లున్న యూపీ స్పెక్ట్రం దక్కించుకోవడానికి టెలికాం సంస్థలు పోటీ పడ్డాయి. ఈ బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. జియో రూ.80వేల 100కోట్లు, ఎయిర్‌టెల్ రూ.50వేల కోట్లు, ఐడియా వొడాఫోన్ రూ.15వేల కోట్లు, అదానీ గ్రూప్ రూ.500 కోట్లు-రూ.1000 కోట్ల బిడ్లు దాఖలు చేశాయి. […]
Parliament Monsoon Session: దేశంలో ధరల పెరుగుదలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది. నిత్యావసర ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని కొద్దిరోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పక్షం ఈ అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలిపింది. సోమవారం లోక్‌సభలో ధరల పెరుగుదలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ పచ్చి వంకాయ […]
Ap 10th Class Results: ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షలు రాసిన వారికి అధికారులు కీలక వార్తను అందించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలపై అధికారులు సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. ఈ పరీక్ష ఫలితాలను బుధవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వివరించారు. కాగా జూలై […]
Uma Maheswari: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఎల్లుండి జరగనున్నాయి. అమెరికాలో ఉన్న ఆమె పెద్ద కుమార్తె, అల్లుడు ఇండియాకు రావాల్సి ఉంది. వాళ్లిద్దరూ వచ్చిన తర్వాతే అంత్యక్రియలను నిర్వహించాలని నందమూరి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మరోవైపు ఉమా మహేశ్వరి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె కళ్లను కుటుంబీకులు దానం చేశారు. భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలించారు. కాగా ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు […]
IND Vs WI: బస్‌టెర్రె వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. అభిమానులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరింది. మ్యాచ్ జరిగే బస్‌టెర్రెలోని వార్నర్ పార్క్‌కు రెండు జట్ల లగేజీ ఆలస్యంగా రావడంతో అనుకున్న సమయానికి […]
Kakani Govardhan Reddy: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ ఆగడాలు మితిమీరుతున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాల వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు. లోన్ యాప్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని.. వీటిపై వెంటనే స్పందించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. లోన్ యాప్ నిర్వాహకుల గ్యాంగ్‌ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారని తెలిపారు. ఆ గ్యాంగ్ […]