Vishnu Vardhan Reddy: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అమరావతి రాజధానితో పాటు రాయలసీమ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. రాయలసీమ నుంచే ఎక్కువమంది ముఖ్యమంత్రులు కావడంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ర్టంలో ఐపీఎస్ లేదు వైసీపీనే ఉందని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు మాట్లాడిందే, చెప్పించే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంపై మహిళా కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు.
Read Also: Bharat Bill Payment System: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ‘భారత్’లోనూ బిల్లులు కట్టొచ్చు
ప్రభుత్వం దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని రాజకీయ నిరుద్యోగ ఉపాధి కోసం వాడుకుంటోందని విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 151 సీట్లు వచ్చాయని సంబరపడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని.. రాష్ట్రంలో సలహాదారులు ఎక్కువయ్యారు కానీ ఏం సలహాలు ఇస్తున్నారో అర్ధం కావడం లేదని విష్ణువర్ధన్‌రెడ్డి చురకలు అంటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.