Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు మరో రెండు పతకాలు వచ్చాయి. అవినాశ్ సేబుల్ 3 వేల మీటర్ల రేస్ వాక్‌లో వెండి పతకాన్ని గెలుచుకున్నాడు. అటు మహిళల 10 వేల మీటర్ల వాకింగ్ పోటీల్లో ప్రియాంక గోస్వామి కూడా సిల్వర్ మెడల్‌ను సాధించింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 28కి చేరింది. ఇందులో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి.
Read Also: TikTok: ఇండియాలోకి మళ్లీ టిక్ టాక్.. ఈ వార్త నిజమేనా?
అటు కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం భారత మహిళా క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 165 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయం అవుతుంది. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో జిన్ గోతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 19-21 తేడాతో కోల్పోయిన సింధు.. తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ షాట్లు కొట్టింది. దీంతో 21-14, 21-18 తేడాతో వరుసగా రెండు సెట్లను గెలుచుకుని, మ్యాచ్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో సింధు సెమీఫైనల్లో అడుగు పెట్టింది. సెమీస్‌లో గెలిస్తే సింధుకు పతకం ఖాయం అవుతుంది.