Botsa Satyanarayana: ఈ యాప్‌ను విద్యాశాఖలోనే కాదు.. అన్ని శాఖల్లోనూ తీసుకువస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఫేస్ రికగ్నిషన్ యాప్ విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ విషయంలో ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని.. నిమిషం ఆలస్యం అయితే ఆబ్సెంట్ వేస్తారన్నది వాస్తవం కాదన్నారు. మూడు సార్లు ఆలస్యంగా వస్తే నాలుగోసారి హాఫ్ డే కింద పరిగణించటం పాత నిబంధనే అని గుర్తుచేశారు. ఈ విషయంలో కొత్త నిబంధనలు పెట్టలేదన్నారు. ఫోటో అప్‌లోడ్, ఇంటర్నెట్ విషయాలకు సంబంధించి సాంకేతిక సిబ్బందితో మాట్లాడామని.. ఇప్పటికే 50 శాతం మంది ఉపాధ్యాయులు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని మంత్రి బొత్స వివరించారు. మిగిలిన వారు కూడా డౌన్ లోడ్ చేసుకోవటానికి, సాంకేతికంగా అవగాహన చేసుకోవటానికి ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నామని తెలిపారు.
ఈ నెల 27 లేదా 28 తేదీల్లో మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై ఈ అంశంపై సమీక్షించాలని నిర్ణయించామని మంత్రి బొత్స తెలిపారు. విద్యాశాఖలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఇదే విధానాన్ని అమల్లోకి తీసుకుని వస్తామన్నారు. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బంది తలెత్తుతుంది అనుకుంటే అవసరమైన మేరకు మార్పులు చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వంలో భాగమని.. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కచ్చితంగా అడ్రస్ చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
Read Also: Rahul Gandhi: ఇలాంటి రాజకీయాలు చేయడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా..?
అటు ఫ్యాప్టో ఛైర్మన్ యన్.వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఫేషియల్ యాప్, ఇతర యాప్‌లు వద్దని చెప్పామని.. అందులో ఎటువంటి ఇబ్బంది లేదని మంత్రి వివరించారని తెలిపారు. ఫేషియల్ యాప్ వాడేందుకు డివైస్‌లు ఇవ్వాల్సిందే అన్నారు. ఈ పదిహేను రోజులు యాప్ పరిశీలించి తమ అభ్యంతరాలు చెప్తామని.. పర్యవేక్షణ అధికారులను పెంచకుండా యాప్‌లతో పని తీరు చెబుతారా అని ప్రశ్నించారు. బోధనేతర పనులు తమకు అప్పగించ వద్దని కోరామన్నారు. గతంలో డివైసెస్ ద్వారా హాజరు వేసే వాళ్లమని.. ఇప్పుడు సొంత ఫోన్ల ద్వారా యాప్ వద్దని చెబుతున్నామన్నారు. అధికారులు ఇబ్బందులు పెట్టడం వల్లే కొంతమంది యాప్‌లు ఓపెన్ చేసుకున్నారన్నారు. అటు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ రోజు మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని.. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి చెప్పారన్నారు. అందరికీ డివైస్‌లు కొనాలంటే 200 కోట్ల వ్యయం అవుతుందన్నారు. తమ ఫోన్ల ద్వారానే యాప్ వాడాలని చెప్పారని.. అందరూ పదిహేను రోజుల్లో ఆలోచించుకోవాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!