Andhra Pradesh: టీడీపీ నేతను ఆరునెలల పాటు బహిష్కరించిన కలెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డికి జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు. ఆయన్ను జిల్లా నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ కలెక్టర్ గిరీష ఆదేశాలు జారీ చేశారు. కురబలకోటలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన కొండ్రెడ్డికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా కొండ్రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. కొండ్రెడ్డిని తరచూ గొడవలకు దిగే నేరస్థుడిగా గుర్తించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం-1980 ప్రకారం సెక్షన్ 2(1) కింద కొండ్రెడ్డిని గూండాగా పరిగణించవచ్చని పేర్కొన్నారు.
Read Also: Chiru: వాల్తేరు వీరయ్య నోట వీర సింహుడి మాట…
Also Read
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తాజా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొండ్రెడ్డి బెయిలుపై కడప జైలు నుంచి బయటకు రాగానే కలెక్టర్ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అందిన తేదీ నుంచి ఆరు నెలలపాటు టీడీపీ నేత కొండ్రెడ్డి అన్నమయ్య జిల్లాను వదిలి వెళ్లాలని ఆదేశించారు. అలాగే ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. దీంతో జైలు నుంచి బయటకు రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ఇటీవల కురబటకోటలో వైసీపీ దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన కొండ్రెడ్డిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడి చేశారని.. ఈ ఘటనలో పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలో అరెస్ట్ అయిన కొండ్రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం సరికాదని మండిపడుతున్నాయి.
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!