What’s Today:
* తిరుమల: నేడు రూ.300 దర్శన టిక్కెట్లు విడుదల.. ఈనెల 12 నుంచి 31 వరకు సర్వదర్శన టిక్కెట్లు జారీ
* నేడు శ్రీశైలం రానున్న పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి
* ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. హిందూపురంలో ఇవాళ జరిగే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొననున్న గిడుగు రుద్రరాజు
* నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. తూప్రాన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. రిట్ పిటిషన్ దాఖలు చేసిన రామేశ్వర్‌పల్లి రైతులు
* కామారెడ్డి: నేడు 49 మంది కౌన్సిలర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్న రైతులు.. మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేయాలని కోరనున్న బాధిత రైతులు
* హైదరాబాద్: నేడు ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా.. సర్పంచ్ సమస్యలపై ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా
* హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూం కేసులో నేడు విచారణకు హాజరుకానున్న సునీల్ కనుగోలు