Viral Video: ప్రధాని మోదీ వస్తున్నారని.. ఎండిపోయిన గడ్డికి గ్రీన్ కలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 11, 12 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ప్రవాసీ భారతీయ సమ్మేళనం జరగనుంది. ‘మధ్యప్రదేశ్-ది ప్యూచర్ రెడీ స్టేట్’ పేరుతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్ సీఎం హాజరుకానున్నారు. అంతేకాకుండా రిలయన్స్, టాటా, అదానీ, బిర్లా వంటి 70 మంది వ్యాపారవేత్తలు రానున్నారు. ఈ మేరకు రోడ్ల పక్కన డివైడర్లపై గడ్డి ఎండిపోవడంతో అధికారులు గ్రీన్ కలర్ పిచికారీ చేయిస్తున్నారు. కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Read Also: Karnataka: శ్రీరామ్ సేన కార్యకర్తపై దుండగుల కాల్పులు..
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ఎందరో అతిరథ మహారథులు ఈ సమ్మిట్‌కు హాజరవుతుండటంతో రోడ్డు పక్కన డివైడర్ల మధ్యన గడ్డి ఎండిపోయి దర్శనమిచ్చింది. దీంతో అప్పటికప్పుడే గడ్డి రంగునే అధికారులు మార్చేయించారు. స్ప్రే పెయింటర్‌ను తీసుకొచ్చి ఎండు గడ్డిపై గ్రీన్ కలర్‌ను పిచికారీ చేయించారు. అలా ఎండు గడ్డికి కలరింగ్ ఇచ్చి తాజాగా ఉన్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. బీజేపీ ప్రభుత్వాలు బుకాయిస్తున్న తీరు ఇక్కడి పనుల్లో కనపడుతోందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అటు కమలనాథులారా కలరింగ్ అంటే ఇదేనా? వావ్ శివరాజ్ వావ్ అంటూ ఓ కాంగ్రెస్ నేత సెటైర్ వేశారు.
अकल्पनीय, अविश्वसनीय तस्वीरें..
प्रधानमंत्री के इंदौर दौरे के पहले इंदौर को हरा-भरा बनाने के लिए BJP सरकार ने घास को ही हरे रंग से रंग दिया। वाह शिवराज वाह!! pic.twitter.com/tMJ2jKc01V
— Srinivas BV (@srinivasiyc) January 8, 2023
తాజావార్తలు
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!