Andhra Pradesh: ఈనెల 31న వినాయకచవితి పండగ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా వినాయకుడి మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయాలంటే అధికారులు ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ స్పందించారు. రాష్ట్రంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని వివరణ ఇచ్చారు. వినాయక చవితి మండపాలు ఏర్పాటు […]
Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో ఆదివారం రాత్రికి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్ ఆడబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. దీంతో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక […]
Vangalapudi Anitha: ఇటీవల విశాఖ పర్యటనలో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. విశాఖ నుంచే ఈ నిషేధం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా […]
పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ మేరకు శనివారం నాడు చిత్ర యూనిట్ సభ్యులు ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ చేరుకుని సందడి చేశారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. రంగ […]
IT Companies Bumper Offer: కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు శ్రమిస్తున్నాయి. చెప్పిన వెంటనే ఆఫీసులకు వచ్చే వారికి అదనపు సెలవులు, అధిక జీతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు లేదంటే అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో కోత విధించేలా పలు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు అధిక సెలవులు ఇవ్వడంతో పాటు భారీ […]
Anasuya: జబర్దస్త్ కామెడీ షోతో పాటు పలు టీవీ షోలు, సినిమాలతో పేరు తెచ్చుకున్న ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనుంది. ట్విట్టర్‌లో తనను పలువురు ‘ఆంటీ’ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. తనను మానసిక వేదనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరనుంది. ఈ మేరకు శనివారం సాయంత్రంలోగా అనసూయ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ […]
Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేసుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. కోల్లుపల్లెలో వైసీపీ నేతలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని.. వైసీపీ జెండాలను కట్టెలతో తొలగించింది టీడీపీ వాళ్లేనని మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వీడియోలు చూపించారు. 33 ఏళ్ళలో ఎన్నిసార్లు […]
Neet Exam: నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. జూలై 17న కొల్లాం జిల్లా ఆయుర్‌లో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులు అవమానానికి గురయ్యారు. మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది అమ్మాయిల లోదుస్తులు విప్పించారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు బ్రా తీసి వెళ్లాలంటూ ఆదేశించారు. ఈ ఘటనపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల లో దుస్తులు […]
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. ఈ నేపథ్యంలో పవర్‌స్టార్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్‌ను […]
బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో బెల్ట్ షాపు నిర్వహణ, నాటుసారా అమ్మకాలకు వేలంపాట నిర్వహించారు. అయితే గ్రామంలోని అధికారులు ఈ వేలంపాట నిర్వహించిన విధానం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. గ్రామంలోని ఓ ఆలయంలో వేలంపాట నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లిక్కర్ షాపు కోసం ఆలయంలో వేలం పాట నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో లిక్కర్ షాపు కోసం వేలం పాట పెట్టి ఓ వర్గాన్ని అవమానపరిచారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వేలం పాటలో […]