Plastic Ban: విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖలో శుక్రవారం నిర్వహించిన ‘సాగర తీర స్వచ్ఛత’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర తీరంలో 20వేల మందితో 28కి.మీ. మేర బీచ్ క్లీనింగ్ చేపట్టి 76 టన్నుల ప్లాస్టిక్‌ను తొలగించామని తెలిపారు. అటు ఏపీలో ఈరోజు నుంచే ప్లాస్టిక్ బ్యానర్లు రద్దు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇకపై క్లాత్ బ్యానర్లు మాత్రమే కనిపించాలని సూచించారు. విశాఖ […]
BWF Championship 2022: జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్-2022లో పురుషుల డబుల్ క్వార్టర్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ జోడీ అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన యుగో కొబయాషి, టకురో హోకిని 24-22, 15-21, 21-14 తేడాతో చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడీ ఓడించింది. జపాన్ వరల్డ్ నంబర్ 2 జోడీపై వీరిద్దరూ గెలుపొందడంతో భారత్‌కు పతకం ఖాయం చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన […]
Gandhi Hospital Doctors: సాధారణంగా రోగికి ఆపరేషన్ చేసే ముందు వైద్యులు మత్తు మందు ఇస్తారు. మత్తు మందు ఇవ్వకుండా సర్జరీలు పూర్తి చేయడం కష్టతరమైన ప్రక్రియ. అయితే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు మత్తు మందు ఇవ్వకుండానే ఓ రోగికి సర్జరీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ 50 ఏళ్ల మహిళకు ట్యాబ్‌లో చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా చూపిస్తూ ఆమెతో మాట్లాడుతూ రెండు గంటలు సర్జరీ […]
Arjun Reddy Delete Scene: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తెచ్చిపెట్టిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. 2017, ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినీ అభిమానులకు ట్రీట్ అందించింది. 2.53 నిమిషాల నిడివి ఉన్న డిలీట్ సీన్‌ను తాజాగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా నుంచి వచ్చిన ఈ డిలీట్ సీన్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ […]
Andhra Pradesh Schools: ఏపీలో స్కూల్ విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు శుభవార్త అందించారు. ఆగస్టు 27న శనివారం నాడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రెండో శనివారమైన ఆగస్టు 13న విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు వచ్చిన నేపథ్యంలో.. ఆగస్టు 13కు బదులుగా ఆగస్టు 27ను సెలవుదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13న అన్ని స్కూళ్లు […]
Central Governement: దేశంలోని వంటనూనె తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వంటనూనెలను ప్యాకింగ్ చేసే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉందనే వివరాలు ఇవ్వడానికి బదులుగా ప్యాకెట్ లేదా సీసాలో ఎంత నూనె ఉందో తెలిపే ఘనపరిమాణం, బరువు వివరాలను ముద్రించాలని వంటనూనెల తయారీ కంపెనీలు, ప్యాకర్లు, దిగుమతిదార్లను కేంద్రం ఆదేశించింది. తూకం విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం వివరించింది. వివరాల ముద్రణలో ఈ మార్పులు చేపట్టేందుకు […]
International Dogs Day: కుక్క అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది విశ్వాసం. కుక్కలకు ఓ ముద్ద అన్నం పెడితే జీవితాంతం అవి మనల్ని వదలవు. వ్యక్తి, ఊరు, దేశ రక్షణలోనూ అవి తనదైన ముద్రను వేస్తున్నాయి. ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది అంటాం కదా.. అదే ఈరోజు. రెస్క్యూ డాగ్స్ ను సురక్షితమైన, వాత్సల్య వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో కుక్కల ప్రాముఖ్యతను అందరికీ చాటిచెప్పడానికి, వాటి దత్తత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి ఏటా […]
New Super Earth: ఈ విశ్వంలో భూమికి మించిన పెద్ద జీవగ్రహం ఉందా అంటే కచ్చితంగా లేదనే సమాధానం వినిపిస్తుంది. అయితే కొన్నాళ్లుగా భూమిపై నివసించే జనాభా పెరిగిపోతుండటంతో మరో గ్రహంపై నివసించేందుకు గల అవకాశాలను సైంటిస్టులు పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సౌరవ్యవస్థ వెలుపల గ్రహాల కోసం వెతుకుతున్న ఖగోళ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేసేలా చాలా లోతైన సముద్రాన్ని కలిగి ఉండే గ్రహం కనుగొనబడింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది భూమిని పోలిన గ్రహం. […]
Irfan Pathan: విస్తారా ఎయిర్‌లైన్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా విస్తారా సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించాడు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లేందుకు విస్తారా విమానం యూకే-201లో టిక్కెట్ బుక్ చేసుకున్నానని.. కానీ చెక్ ఇన్ కౌంటర్ వద్ద తనకు చేదు అనుభవం ఎదురైందని పఠాన్ వివరించాడు. తన భార్య, పిల్లలతో దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నానని.. […]
Tallest Buildings: ఏ దేశంలో అయినా మహానగరాలు అనగానే అందరికీ ఎత్తైన భవనాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే మహానగరాలలో మాత్రమే అంతటి ఎత్తైన భవనాలను నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇస్తారు. మన దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఎత్తయిన భవనాలు కనిపిస్తాయి. అయితే విదేశాలలో ముఖ్యంగా దుబాయ్ లాంటి నగరాలల్లో ఎత్తయిన భవనాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో అత్యధిక ఎత్తయిన భవనాలు ఉన్న నగరం గురించి చాలా మందికి తెలియదు. 200 మీటర్లు […]