Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. ఈ నేపథ్యంలో పవర్‌స్టార్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్‌ను మించే హిట్ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్‌కు హరీష్ శంకర్ ఇచ్చిన జవాబు ఇప్పుడు వైరల్‌గా మారింది.
Read Also: What is The BJP Plan: ఎన్టీఆర్‌తో సరే..! నితిన్ ఎందుకు..? బీజేపీ ప్లాన్ అదేనా..?
సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమాని ఓ ట్వీట్ చేశాడు. ‘ఆ స్టైల్, స్వాగ్, స్టెప్స్ ఏమైపోయాయ్ కళ్యాణ్ అన్నా. హరీష్ శంకర్ అన్నా.. మళ్లీ నీ వల్లే అవుతుంది ఇవన్నీ.. నీ సినిమాతోనే లాస్ట్ అనిపిస్తుంది’ అని సదరు అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ శంకర్ స్పందిస్తూ ‘ అన్నీ ఉంటాయ్.. ఏదీ మిస్ అవ్వదు.. మీ ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం వస్తుంది నన్ను నమ్మండి’ అంటూ సమాధానం ఇచ్చాడు. హరీష్ శంకర్ జవాబుతో పవన్ అభిమానులు సంబరపడిపోతున్నారు. గబ్బర్ సింగ్‌కు మించిన హిట్ వస్తుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అభిమానులందరూ ఆయన పుట్టినరోజు వేడుకల సన్నాహాలలో మునిగిపోయారు. సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ బర్త్ డే కావడంతో తమ హీరో నటించిన జల్సా సినిమా స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 1న ఈ షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్లను బుక్ చేసుకున్నారు. కాగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.
Harish Shankar Latest Tweet:
Anni untaay…. Edhi miss avvadhu …trust me its worth waiting for u and me 👍👍 https://t.co/8uo7ObiDOE
— Harish Shankar .S (@harish2you) August 27, 2022