Kottu Satyanarayana: ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఫైర్ సేఫ్టీ కోసం రూ.500, మైక్ పర్మిషన్ కోసం రోజుకు రూ.100 చలానా రూపంలో కట్టాలని.. ఈ నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. కొత్తగా పెట్టిన నిబంధనలు కాదని స్పష్టం చేశారు. కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే గణేష్ మండపాల ఏర్పాటుకు ఈ నిబంధనలు వర్తిస్తాయని.. గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదని తెలిపారు. దేవుడితో చెలగాటం […]
Pawan Kalyan: ఏపీలో ఇప్పటికిప్పుడు సడెన్‌గా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. విశాఖలో పరిశ్రమల కాలుష్యం, విషవాయువు లికేజీ లాంటి అంశాల్లో మందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఘటనలకు బాధ్యులైనవారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, రిషికొండను ధ్వంసం చేసినా పట్టించుకోలేదని.. సడెన్‌గా పర్యావరణంపై ఇప్పుడు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు […]
IND Vs PAK: ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కాగా రోహిత్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ మాత్రం తనకు లభించిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకుని 35 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. 15 ఓవర్‌లో హార్దిక్ పాండ్యా […]
Asia Cup 2022: దుబాయ్ వేదికగా ఆసియా కప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 పరుగులకు అవుటయ్యాడు. ఓపెనర్ రిజ్వాన్ (43) నిలబడ్డా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. వరుస విరామాల్లో పాకిస్థాన్ వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు […]
Face Recognisation App: సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ పేరుతో ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల్లోని పలువురు టీచర్లు సిద్ధం అవుతున్నారు. అయితే టీచర్ల హాజరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వారిని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆందోళనల్లో పాల్గొనే టీచర్లను గుర్తు పట్టే ప్రయత్నాల్లో నిఘా వర్గాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. […]
Ind Vs Pak: ఆసియాకప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దినేష్ కార్తీక్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ 14 సార్లు తలపడగా 8 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా ఆరుసార్లు పాకిస్థాన్ గెలిచింది. అటు వందో టీ20 ఆడుతున్న కోహ్లీకి టీమ్‌మేట్స్ […]
ఆసియాకప్‌లో కాసేపట్లో హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారని విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మను అడగ్గా.. టాస్ వేశాక ఎవరు ఓపెనర్లుగా వస్తారో మీరే చూడండి అంటూ రోహిత్ సమాధానం చెప్పాడు. తమకు కొన్ని రహస్యాలు ఉంటాయని.. వాటిని బయటకు చెప్పలేమని స్పష్టం చేశాడు. కొంతకాలంగా టీమిండియా ఓపెనర్లుగా పలు కాంబినేషన్‌లను టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయత్నించింది. రోహిత్-సూర్యకుమార్ యాదవ్, రోహిత్-రిషబ్ పంత్, రోహిత్-కేఎల్ […]
Amarnath Reddy: ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నందుకు 59 మందిపై కేసులు నమోదు చేశారని.. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేయించడం భావ్యం కాదన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమంగా టీడీపీ […]
Lying Down Championship: ఎక్కడైనా పనిచేస్తేనే డబ్బులు వస్తాయి.. పనిచేయకపోతే డబ్బులు ఎవరూ ఊరికే ఇవ్వరు. కానీ ఆ దేశంలో నిద్రపోతే డబ్బులు ఇస్తారు. దీని కోసం పోటీ కూడా నిర్వహిస్తారు. ఎవరు ఎక్కువ సేపు నిద్రపోతే వాళ్లు విజేతగా నిలిచి డబ్బులను గెలుచుకుంటారు. ఇలాంటి పోటీలు యూరప్ ఖండంలోని మాంటెనెగ్రె దేశంలో జరుగుతున్నాయి. ఆ దేశంలోని ఓ గ్రామంలో ఏడాదికి ఓసారి నిద్ర పోటీలను (లైయింగ్ డౌన్ ఛాంపియన్‌షిప్) నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటు […]