Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు, ఒలింపిక్ ఛాంపియన్ 24 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రఖ్యాత డైమండ్ లీగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు. మూడో ప్రయత్నంలో […]
Liger Rating: అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ, కథనాలు సాధారణంగా ఉన్నాయని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ మూవీ సైట్ ఐఎండీబీ ఇచ్చే రేటింగ్‌లో లైగర్ […]
Chiranjeevi: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 60 ఏళ్ల మహిళకు ట్యాబ్‌లో ‘అడవి దొంగ’ సినిమా చూపిస్తూ వైద్యులు ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా మహిళ మెదడులో కణతులు తొలగించారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో మహిళతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ వార్త శుక్రవారం నాడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తన పీఆర్వో ఆనంద్‌ను గాంధీ ఆస్పత్రికి […]
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తరహాలో ఏపీలో మరో ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల వాసులు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 35 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఈ నెలలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. చీమలపాడు, దీప్లానగర్, చైతన్య నగర్, మాన్ సింగ్ తండా, రేపూడి తండా, కంభంపాడు, లక్ష్మీపురం, పెద్దతండా సహా […]
BigBoss Season 6: అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్‌లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఈ షో కోసం నిర్వాహకులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మరోసారి స్టార్ కపుల్ అభిమానులను సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సీజన్-3లో వరుణ్ సందేశ్-వితికా జంట కనువిందు చేసింది. ఇప్పుడు సీజన్-6లో ప్రముఖ సింగింగ్ కపుల్ హేమచంద్ర-శ్రావణభార్గవి […]
Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగా యూఏఈకి షిఫ్ట్ చేశారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఆరు జట్లు.. 13 మ్యాచ్‌లు.. 16 రోజుల పాటు జరగనున్నాయి. […]
What’s Today: • ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ • విశాఖలో నేడు మంత్రి మేరుగు నాగార్జున పర్యటన.. మధురవాడలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని సందర్శించనున్న మంత్రి నాగార్జున • విజయవాడ: నేడు 58వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు • పల్నాడు జిల్లా: నేడు నాదెండ్ల మండలం సాతులూరులో గడపగడపకు మన ప్రభుత్వ […]
Asia Cup 2022: రేపటి నుంచి దుబాయ్‌లో ఆసియా కప్ సమరం ప్రారంభం కాబోతోంది. టోర్నీలో రెండో రోజే హైఓల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు దుబాయ్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో శిక్షణ సెషన్‌లు నిర్వహిస్తుండగా.. భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు కలుసుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు. ఒకవైపు ఇరుదేశాల అభిమానులు ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అని టెన్షన్ పడుతుంటే.. భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం […]
Budda Venkanna: కుప్పంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకునే యత్నం నిరసిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. వైసీపీ అజెండా అమలు చేసే పోలీసుల్ని చొక్కాలు ఊడతీసి కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబాన్ని అంతమొందించే లక్ష్యంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులందరూ వైసీపీ యూనిఫామ్ […]
Minister Roja: రాజమండ్రిలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని.. చంద్రబాబు ఫోటో […]