APPSC Exams: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021లో విడుదల చేసిన పలు నోటిఫికేషన్‌లకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారులు విడుదల చేశారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, సబ్జెక్ట్ పేపర్ పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. గెజిటెడ్ విభాగంలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు అక్టోబర్ 21న జరుగుతాయి. సబ్జెక్ట్ పేపర్ పరీక్షల్లో పేపర్-2 19వ తేదీ […]
Team India: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 30 కంటే ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ కెప్టెన్సీ నమోదు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 36 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. అందులో 30 మ్యాచ్‌లను భారత్ గెలుచుకుంది. కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ విన్నింగ్ […]
CPS Employees: సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు ఓ ప్రకటన జారీ చేశారు. APCPSEA ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా సెప్టెంబర్ 1వ తేదీన శాంతియుత ర్యాలీ, సభల ద్వారా సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామని తెలిపారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలకు ప్రతిసారి పోలీసు అనుమతి తీసుకుని నిర్వహిస్తూ వచ్చామని.. అలాగే సెప్టెంబర్ 1న చలో విజయవాడ పేరుతో నిర్వహించబోయే […]
Reliance Industries: ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలయన్స్ కంపెనీల బాధ్యతలను వారసులకు అప్పగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదే నాయకత్వ బదలాయింపు ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించగా.. తాజాగా నాయకత్వ బదలాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ జియో ఛైర్మన్‌గా నియమితులయ్యాడు. అటు చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రిలయన్స్ గ్రూప్ ఇంధన వ్యాపార బాధ్యతలను అప్పగించారు. […]
Team India: టీమిండియా స్టార్ ఆటగాడు ధోనీ రిటైర్ అయ్యాక ఫినిషర్ పాత్రను పోషించేవాళ్లు కరువయ్యారు. ఎందుకంటే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు గొప్ప ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. ఫినిషర్‌కు ఉండాల్సిన లక్షణాలేంటో ధోనీ తన ప్రదర్శనల ద్వారా చూపించాడు. అయితే కొన్నాళ్లు ధోనీ స్థానాన్ని రీప్లేస్ చేసేలా హార్దిక్ పాండ్యా ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత ఫిట్‌నెస్ లేమి, ఫామ్ కోల్పోవడంతో అతడు జట్టులోనే స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర […]
ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా పలు వస్తువులను ఆర్డర్ చేస్తుంటారు. ఈ-కామర్స్ సైట్‌లో బుక్ చేసే ఆర్డర్ మీకు ఎలా డెలివరీ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చాలా మంది బుక్ చేసే పార్శిళ్లలో వస్తువులు డ్యామేజ్ అయితే డెలివరీ బాయ్స్ కారణమని నిందిస్తుంటారు. కానీ ఆ పార్శిళ్లు ఎక్కడి నుంచి రవాణా అయ్యాయి.. ఎలా రవాణా అయ్యాయన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఈ నేపథ్యంలో పార్శిల్ భద్రత గురించి డెలివరీ […]
Viral Video Of Live Reporting: మీడియా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా రంగంలో చాలా మంది జర్నలిస్టులు ఎన్నో సందర్భాల్లో సాహసాలు సైతం చేస్తుంటారు. తాజాగా పాకిస్తాన్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ పీకల్లోతు నీటిలో వరదలో […]
CM Jagan: సెప్టెంబరు 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి సీఎం జగన్ గైర్హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి నేపథ్యంలో ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. […]
Jay Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జై షాపై నెటిజన్‌లు మండిపడుతున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జాతీయ పతాకాన్ని జై షా అవమానించారంటూ నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి గెలిపించడంతో స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు సంబరాలు చేసుకున్నారు. […]
Asia Cup 2022: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన, భువనేశ్వర్ బౌలింగ్, విరాట్ కోహ్లీ విలువైన పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆసియాకప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పోటీ […]