Anasuya: జబర్దస్త్ కామెడీ షోతో పాటు పలు టీవీ షోలు, సినిమాలతో పేరు తెచ్చుకున్న ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనుంది. ట్విట్టర్‌లో తనను పలువురు ‘ఆంటీ’ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. తనను మానసిక వేదనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరనుంది. ఈ మేరకు శనివారం సాయంత్రంలోగా అనసూయ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాపై అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వివాదానికి కారణమైంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాలోని డైలాగ్‌తో ముడిపెడుతూ లైగర్ ఫలితంపై అనసూయ పలు వ్యాఖ్యలు చేసింది. అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు అంటూ ట్వీట్ చేసింది.
Read Also: Sonali Phogat Case: బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ హత్య కేసులో డ్రగ్ డీలర్ తో సహా మరొకరి అరెస్ట్
దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను ట్రోల్ చేస్తూ ఆంటీ అంటూ ఆటపట్టిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆంటీ అనే పదం ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ అనసూయ పలు ట్వీట్లు చేసింది. తన ఏజ్‌ను ప్రస్తావిస్తూ ఆంటీ అని కామెంట్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది. తన జోలికి వస్తే జైలుకు పంపిస్తానంటూ మండిపడింది. అయినా విజయ్ అభిమానులు వెనక్కి తగ్గలేదు. స్టార్ హీరో ప్రభాస్‌నే అంకుల్ అంటున్నాం.. నువ్వెంత అనసూయ ఆంటీ అంటూ ఇంకా రెచ్చిపోయారు. అయితే తన సినిమాలతో ఇండియాతో పాటు సినీ ఇండస్ట్రీకి పేరు తెచ్చిన హీరోలను అంకుల్ అనడం కూడా తప్పేనని అనసూయ క్లాస్ పీకింది. 25 ఏళ్లకు పైబడి పిల్లలు ఉంటే ఆంటీ అని పిలుస్తారా.. మగవాళ్లకు కూడా ఇది వర్తిస్తుందా అని కౌంటర్లు వేసింది. మరోవైపు అనసూయకు మద్దతుగా మాట్లాడిన నటి శ్రద్ధాదాస్‌ను కూడా నెటిజన్‌లు ట్రోల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Good morning 😁#Aunty pic.twitter.com/fssttxKEoW
— Srikanth DHFM🏌️🔔 (@urstruly_srii) August 27, 2022