ICC Player Of the Month: ఆగస్టు నెలకు సంబంధించి మూడు ఫార్మాట్లలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం ముగ్గురు క్రికెటర్లు నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఐసీసీ ఈ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్, జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా ఉన్నారు. వీరిలో సికిందర్ రజా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌తో […]
Somu Veerraju: విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరును సోము వీర్రాజు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నృత్యం చేసిన చిన్నారి గురించి ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడు అని.. భరత నాట్యాన్ని అభ్యసించాడని.. బాల రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని.. భరత […]
Team India: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధానంగా చేసిన మూడు తప్పులే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్‌లు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో జట్టులోకి తీసుకున్న దీపక్ హుడా చేత బౌలింగ్ వేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇస్తున్నా అతడిని గుడ్డిగా నమ్మి ఫుల్ ఓవర్లు వేయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ మహ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో […]
Andhra Pradesh: ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని గ్రామ పంచాయతీ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు పీఆర్ కమిషనర్‌కు సీఐటీయూ అనుబంధ పంచాయతీ ఉద్యోగుల సంఘం నోటీసులు పంపింది. తొమ్మిది ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసు జారీ చేసింది. బకాయి జీతాలు వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలను కాపాడాలని, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం నెలకు రూ.20 వేలు […]
Virat Kohli: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం నాడు సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై ఓడిపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో అర్ష్‌దీప్ సింగ్ అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అర్ష్‌దీప్ క్యాచ్ విడిచిపెట్టడంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీని అడగ్గా.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంతో టెన్షన్ ఉంటుందని.. […]
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొడుతోంది చంద్రబాబేనని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన ఖర్మ అన్నారు. గత 60 ఏళ్ళుగా గురువులను పూజించుకోవటం ఆనవాయితీగా వస్తోందని.. ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి గురువులను స్మరించుకుంటూ ఉంటారని.. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సత్కరించారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని.. ఆయన […]
Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త-పార్ట్ 1’పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో ఈ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. రణబీర్ పూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పలు వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ అవుతుండటం చిత్రబృందాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. దీనిపై స్టార్ ఇండియా సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని అనధికారికంగా […]
Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర […]
Police fighting: సాధారణంగా రోడ్డుపై సామాన్యులు కొట్లాటకు దిగితే పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుంటారు. కానీ అదే పోలీసులు కొట్టుకుంటే వారిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరప్రదేశ్ జలౌన్‌లో తాజాగా ఇద్దరు పోలీసులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సదరు పోలీసులు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్‌కు మధ్య ఘర్షణ తలెత్తగా […]
Telugu Desam Party: ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అనుమతులు తీసుకోకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంపై వివాదాస్పదం అవుతోంది. మరోవైపు అన్నా క్యాంటీన్‌ల ఏర్పాటు విషయంలో టీడీపీ నేతల్లో సమన్వయం కొరవడుతోంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు వెలుగు చూశాయి. పోటీపోటీగా […]