Minister PeddiReddy Ramachandra Reddy: ఏపీలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఎటువంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఇంధన, గనులు, ఎపిఎండిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఇడిసిఎపి రూపొందించిన హ్యాండ్ బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న […]
IND Vs SL: ఆసియా కప్‌లో శ్రీలంకపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ(72), సూర్యకుమార్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల లక్ష్యం నిలిచింది. శ్రీలంక బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో భారత బ్యాటర్లను ఔట్ చేశారు. లంక బౌలర్లలో మధుశంక 3, […]
Save Desi Cows: క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ అల్లోల దివ్యారెడ్డి.. ఎంపీ సంతోష్ కుమార్‌ను కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఎంపీ సంతోష్ కుమార్‌ను కలిసి దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్ తరాలకు […]
IND Vs SL: ఆసియా కప్‌లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. పాకిస్థాన్‌తో ఆడిన రవి బిష్ణోయ్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్‌కు స్థానం కల్పించింది. అయితే ఆశ్చర్యకరంగా దీపక్ హుడానే కొనసాగిస్తూ అక్షర్ పటేల్‌కు మరోసారి మొండిచేయి చూపించింది. గత […]
Andhra Pradesh Ex Minister Narayana: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. ఈ కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం నాడు ఏపీ హైకోర్టు […]
Asia Cup 2022: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ పాకిస్థాన్ గెలుస్తుందంటూ సెహ్వాగ్ జోస్యం చెప్పడంతో పలువురు నెటిజన్‌లు మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మంగళవారం నాడు శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే దాయాది పాకిస్థాన్ ఆసియా కప్ ఎగరేసుకుపోతుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే దాయాది పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు […]
Vijayawada: ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. ఈ మేరకు విజయవాడలో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వారంలో న్యాయం చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు స్పందించడంలేదంటూ అగ్రిగోల్డ్ బాధితులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ […]
Polavaram Project: ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు నెలకొందని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు పిటిషన్‌లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌లను స్వీకరించి విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి పోలవరం నిర్మాణం చేపట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. పర్యావరణ అనుమతులకు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని కోర్టుకు వివరించారు. ఈ అంశంపై […]
Central Government: దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.7183.42 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఐదో ఆర్థిక కమిషన్ చేసిన సిఫారసుల మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన నిధులలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.1132.25 కోట్లు, కేరళకు రూ.1097.83 కోట్లు, ఏపీకి రూ.879.08 కోట్లు విడుదలయ్యాయి. రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఆర్ధిక […]
Make Love Not War: ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు ఓ జంట ప్రేమ కూడా నడిపిస్తోంది. రష్యాలో జన్మించిన వ్యక్తి, ఉక్రెయిన్‌లో జన్మించిన మహిళ ప్రేమించుకుని భారత్‌లో ఒక్కటయ్యారు. ఆగస్టు 2న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 5న తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది. వివరాల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల ఉక్రెయిన్ […]