ArshDeep Singh: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప తేడాతో ఓడిపోయింది. కీలక సమయంలో టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కొందరు అతడిని ఖలిస్థాన్ దేశస్థుడిగా చిత్రీకరించారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అర్ష్‌దీప్ సింగ్ పట్టించుకోకుండా శ్రీలంకతో మ్యాచ్ ఆడాడు. తనపై వచ్చిన కామెంట్స్‌ను చూసి నవ్వుకున్నానని అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా చెప్పాడు. అయితే […]
World Largest Pen: సాధారణంగా మనం రాసుకునే పెన్ను జానా బెత్తెడు ఉంటుంది. అంత సైజు ఉంటేనే పెన్నుతో మనం రాయగలం. కానీ అదే పెన్ను 20 అడుగులు ఉంటే అది రికార్డే అవుతుంది. తాజాగా దేశంలోని ఓ పెన్ను ప్రపంచంలోనే అతి పెద్ద పెన్నుగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోని నౌరంగాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ అట్రీ అతిపెద్ద ఇంక్ పెన్ను తయారు చేశాడు. 20 అడుగుల పొడవు, 43 కిలోల బరువు […]
ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ ఆటగాడిగా అవతరించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్థానాన్ని రిజ్వాన్ ఆక్రమించాడు. దీంతో బాబర్ ఆజమ్ రెండో స్థానానికి పడిపోయాడు. రిజ్వాన్ ఖాతాలో 815 రేటింగ్ పాయింట్లు ఉండగా బాబర్ ఆజమ్ ఖాతాలో 794 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో మహ్మద్ రిజ్వాన్ అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే […]
Andhra Pradesh: ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుండగా.. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.18,750 […]
Botsa Satyanarayana: ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని ఏపీలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారని.. […]
CM Jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలను సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన పలువురు మంత్రుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నా.. మంత్రులు స్పందించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. మంత్రులు తీరు మార్చుకోకపోతే కేబినెట్‌లో మార్పులు తప్పవని జగన్ హెచ్చరించారు. తేడా వస్తే ఇద్దరు, ముగ్గురిని తప్పించడానికి వెనకాడనని […]
Team India: ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియాపై పలువురు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అసలు టీమిండియా ఆసియాకప్‌కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ పరమ చెత్తగా ఉందని.. అతడి నిర్ణయాలు అంతుబట్టలేని విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆసియా కప్‌ను ప్రయోగాల కోసం వాడుకుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌పైనా దుమ్మెత్తి పోస్తున్నారు. టీ20 ప్రపంచకప్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా టీమ్ సెట్ కాకపోవడం ఏంటని […]
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లలో సున్నా పరుగులకే అవుటైన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడిన కోహ్లీ మధుశంక బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసి ఊపు […]
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశం బుధవారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కొంత స్పష్టతకు ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు సీపీఎస్ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో పాటు మిగిలిన అన్ని జేఏసీలతో జీవోఎమ్ భేటీ కానుంది. జీపీఎస్‌లో మరింత మెరుగైన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలకు వివరించాలనే ఆలోచనలో […]
Gorantla Madhav: ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పరువు తీశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంగళవారం నాడు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన సీఐడీ అడిషనల్ డీజీకి లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ పనిచేస్తోందని […]