Brahmastra: విడుదలకు ముందే ‘బ్రహ్మాస్త్ర’ స్ట్రీమింగ్.. 18 వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త-పార్ట్ 1’పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో ఈ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. రణబీర్ పూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పలు వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ అవుతుండటం చిత్రబృందాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. దీనిపై స్టార్ ఇండియా సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని అనధికారికంగా స్ట్రీమింగ్ చేస్తున్న 18 వెబ్ సైట్లను హైకోర్టు బ్లాక్ చేసింది.
Read Also: జీవిత భాగస్వామిని వెతుకుతున్నారా.. ఈ విషయాలను పట్టించుకోవద్దు..
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఓ సినిమాను తొలుత థియేటర్లలో విడుదల చేయడం, ఆ తర్వాత వివిధ వేదికలపై ప్రదర్శించేందుకు అనుమతించడం జరుగుతుందని స్టార్ ఇండియా సంస్థ కోర్టుకు వివరించింది. ఓ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ అనేది వ్యాపారపరంగా ఎంతో ముఖ్యమైన దశ అని తెలిపింది. అయితే కొన్ని దుర్మార్గపు వెబ్ సైట్లు అక్రమార్జన కోసం చిత్రాలకు సంబంధించిన కాపీలను సంపాదించి అక్రమ రీతిలో స్ట్రీమింగ్ చేస్తున్నాయని స్టార్ ఇండియా ఆరోపించింది.
దీంతో బ్రహ్మాస్త్ర మూవీకి సంబంధించిన కంటెంట్ కలిగి ఉండటం, స్ట్రీమింగ్ చేయడం, ప్రదర్శించడం, డౌన్‌లోడింగ్‌కు చేయడానికి వీలుగా కంటెంట్‌ను అందుబాటులో ఉంచడం, అప్ లోడ్ చేయడం, నవీకరించడం, మార్పులు చేర్పులతో ప్రసారం చేయడం, ఇంటర్నెట్ ద్వారా, మరే ఇతర వేదిక ద్వారా వెబ్ సైట్లు షేర్ చేయడం అనేది హక్కులను ఉల్లంఘించడమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 18 వెబ్ సైట్లను గుర్తించి బ్లాక్ చేసింది. తదుపరి విచారణ వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మరోవైపు కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హక్కులను ఉల్లంఘించిన వెబ్ సైట్లకు అనుమతి నిరాకరించేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది. పైరసీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేదని, పైరసీ ఎక్కడున్నా ఉక్కుపాదంతో అణచివేయాలని ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!