Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 రసవత్తరంగా మారింది. పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఇప్పుడు పాయింట్ల టేబుల్ ఆసక్తి రేపుతోంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించడంతో ప్రస్తుతం ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో పాకిస్థాన్ ఉంది. శ్రీలంక నెట్ రన్‌రేట్ 0.589గా నమోదు కాగా పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ 0.126గా ఉంది. టీమిండియా నెట్ రన్‌రేట్ మాత్రం -0.126గా, ఆప్ఘనిస్తాన్ నెట్ రన్‌రేట్ -0.589గా ఉంది. పాయింట్ల పట్టికలో […]
WikiPedia: తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఖలిస్థాన్ దేశస్థుడిగా పేర్కొన్నందుకు వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల సామరస్యం దెబ్బతింటుందని , అతడి కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. […]
IND Vs PAK: దుబాయ్ వేదికగా టీమిండియాతో సూపర్-4లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 181/7 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో పాకిస్థాన్ జట్టును ఆదుకున్నాడు. అతడు 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 […]
CM Jagan: ఈనెల 6న మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ మేరకు సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు […]
IND Vs PAK: దుబాయ్ వేదికగా సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28), రోహిత్ (28) జోరుతో టీమిండియా 200 పరుగులకు పైగా స్కోరు చేస్తుందని అభిమానులు ఆశించారు. ఓపెనింగ్‌లో శుభారంభం దక్కినా ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయిన భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 60 […]
IPL 2023: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ముందుంటాయి. సీఎస్‌కే విజయాల్లో ధోనీ, ముంబై విజయాల్లో రోహిత్‌లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. అయితే గత సీజన్‌లో ఈ రెండు జట్లు చతికిలపడ్డాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. దీనికి కారణం నాయకత్వం. గత ఏడాది ధోనీ నాయకత్వ బాధ్యతలను జడేజాకు అప్పగించాడు. అయితే ఈ మార్పు సీఎస్‌కే విజయాలపై ప్రభావం చూపింది. […]
IND Vs PAK LIVE UPDATES: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈరోజు మరోసారి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
Hyderabad: హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వాహనదారులు ఇబ్బంది పడేది ట్రాఫిక్‌తోనే. ట్రాఫిక్ కారణంగా ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు వెళ్తుంటారు. ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంది. ట్రాఫిక్ వల్ల కొంతమంది నరకం చూస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కంటే ఎక్కువగా ఛలానాలపైనే దృష్టి పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై కెమెరాలు పట్టుకుని కూర్చుని, టపాటపా ఫొటోలు తీస్తున్నారు కానీ ట్రాఫిక్ […]
Hyderabad: హైదరాబాద్ నగరం మహేంద్ర హిల్స్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సెప్టెంబర్ 3న ‘నైపుణ్య’ పేరుతో నిర్వహించిన అంతర్గత పోటీల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తంగా 12 స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ జనార్ధన రాజు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హాజరయ్యారు. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు పోటీల్లో […]
Interesting Facts: చాలా మంది పుణ్యక్షేత్రాలను చూసేందుకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే కొలనులు, సరస్సులు, నదుల్లో కాయిన్స్ వేయడాన్ని చాలా మంది గమనించే ఉంటారు. రైలులో వెళ్లేటప్పుడు కృష్ణా బ్రిడ్జి, గోదావరి బ్రిడ్జిలపై నుంచి కూడా ప్రయాణికులు రూపాయి బిళ్లలు నదుల్లో పడేస్తుంటారు. కానీ అలా ఎందుకు వేస్తారో కొంతమందికి తెలియక సందిగ్ధంలో పడుతుంటారు. అయితే నదుల్లో, ఆలయాలలో ఉండే కొలనుల్లో కాయిన్స్ వేయడానికి చాలా కారణాలున్నాయని పెద్దలు వివరిస్తున్నారు. పురాతన కాలంలో రాగి నాణేలను ఎక్కువగా […]