Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిపై ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబు జగన్‌పై విమర్శలు చేస్తున్నాడని.. హైదరాబాద్‌ను నిర్మించడం ప్రారంభించింది తానేనని చెప్పుకుంటున్నాడని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని.. 1995లో చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత హైదరాబాద్‌ను నిర్మించడం ప్రారంభించాడట.. దానిని వైఎస్ఆర్ కొనసాగించారట అంటూ ఎద్దేవా చేశారు. భ్రమరావతి పేరుతో చంద్రబాబు సృష్టించిన గ్రాఫిక్స్‌ను జగన్ కొనసాగించాలా అని […]
Ravindra Jadeja: ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత రవీంద్ర జడేజా ఉన్నట్టుండి గాయపడ్డాడు. దీంతో అతడు ఆసియా కప్‌కే కాకుండా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అతడు మ్యాచ్‌లో గాయపడకుండా కేవలం టీమ్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంతోనే గాయపడినట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజీలో హాంకాంగ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత రిలాక్సేషన్ కోసం దుబాయ్‌లోని సముద్ర జలాల్లో ఓ సాహస కృత్యం చేయబోయి జడేజా గాయపడినట్లు సమాచారం అందుతోంది. అ […]
Minister Appala Raju: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు అమరావతి నుంచి అరసవల్లి యాత్ర అంటూ చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘూతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపై దండయాత్ర కోసమేనా అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వాళ్ల అమరావతి యాత్రనా లేదా విశాఖపై […]
Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ రంగాల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పూర్తిగా తేలిపోయింది. దీంతో ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. భువనేశ్వర్ స్వింగ్ దెబ్బకు ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. అయితే ఈ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు అనుమానాస్పదంగా ఉన్నాయని నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇచ్చిన పలు […]
Red Sandle Smugling: ఎర్రచందనం అక్రమ రవాణాలో కొంతమంది కొత్త దారులు వెతుకుతున్నారు. పుష్ప సినిమా స్టైలులో పశువుల దాణాను తీసుకువెళ్తున్నట్లు కలరింగ్ ఇచ్చి ఆ బస్తాల మాటున ఎర్రచందనాన్ని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీసులు అనుమానంతో ఓ లారీని ఆపి తనిఖీలు నిర్వహించగా ఎర్రచందనం అక్రమ రవాణా వెలుగు చూసింది. అయితే ఈ అక్రమ రవాణా కోసం తిరుపతి-చెన్నై కాదని ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌ను ఎర్రచందనం దొంగలు ఎంచుకోవడం హైలెట్ అని చెప్పాలి. […]
Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్‌కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే […]
Sunil Gavaskar: ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులోని ఆటగాళ్లను తరుచూ మాట్లాడటం వల్లనే టీమిండియాకు ఈ గతి పట్టిందన్నాడు. 11మంది ఆటగాళ్లు తరచూ కలిసి ఆడకపోవడంతోనే ఆసియా కప్‌లో స్పీడ్ అందుకోలేకపోయారని.. అందుకే టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులోని ఆటగాళ్లను దక్షిణాఫ్రికా, ఆసీస్‌తో సిరీస్‌లకు ఆడించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆటగాళ్ల ఎంపికలో […]
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీసీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు. ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తామని.. ప్రభుత్వం చేసిన కొన్ని ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించామని తెలిపారు. సీపీఎస్ అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీ వేశారని.. ఓపీఎస్ వల్ల జరిగే భవిష్యత్తులో ఆర్ధికపరంగా విపత్తు వచ్చే అవకాశం ఉందని సజ్జల వివరించారు. […]
Tirumala Temple: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఒక రోజు, నవంబర్ నెలలో మరో రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో టీటీడీ పేర్కొంది. అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5:11 గంటల నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. […]