Save Desi Cows: ఎంపీ సంతోష్ కుమార్‌ను కలిసిన అల్లోల దివ్యారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Save Desi Cows: క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ అల్లోల దివ్యారెడ్డి.. ఎంపీ సంతోష్ కుమార్‌ను కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఎంపీ సంతోష్ కుమార్‌ను కలిసి దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్ తరాలకు ఈ సంపాదనను అందించాలనే కర్తవ్యంతో సేవ్ దేశీ కౌస్ ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.
పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సీడ్ గణేషా లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దేశవాళీ ఆవుల, పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా చేయూతను అందించాలని ఎంపీ సంతోష్ కుమార్‌ను కోరారు. రోగ నిరోధక శక్తిలో, పాల నాణ్యతలో దేశీ ఆవులకు సాటిరాని హైబ్రీడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతులను అరికట్టిను దేశవాళీ ఆవుల పోషణ వృద్ధి చెందేలా మన రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక బాధ్యతగా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యారెడ్డి చేస్తున్న కృషిని ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.
Also Read

తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!