CM Jagan: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో గెలవాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 22న కుప్పంలో పర్యటించి రూ.66 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ […]
Lakshmi Parvathi: చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరు అంటూ సుప్రీంకోర్టు ఆమెను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. తన కేసులో ఒకరి ఆస్తుల గురించి ప్రశ్నించడానికి తానెవరు అని అత్యున్నత నాయస్థానం ప్రశ్నించిందని.. అయితే జగన్ ఆస్తుల కేసులో శంకర్‌రావు ఎవరు అని […]
Puri Jagannath: టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సాయికుమార్ హైదరాబాద్ నగరంలోని దుర్గంచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధను తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. Read Also: Ponniyin Selvan: I : మణిరత్నంపై హృతిక్, […]
Aaron Finch: ఆస్ట్రేలియా జట్టు వన్డే కెప్టెన్ అరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ తనకు చివరిది అని అరోన్ ఫించ్ పేర్కొన్నాడు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డే ఫించ్ వన్డే కెరీర్‌లో చివరిది కానుంది. అరోన్ ఫించ్ ఇప్పటివరకు 145 వన్డేలు ఆడి 5,041 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు […]
VijayaSaiReddy: భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌లోని శ్రీనగర్ దాకా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరగనుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 3,570 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర కోసం సాధారణ కంటైనర్లను ఏర్పాటు చేశామని.. రాహుల్ గాంధీ అందులోనే బస చేస్తారని.. స్టార్ హోటళ్ల లాంటి సౌకర్యాలను వాడుకునే ప్రసక్తే లేదని […]
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు పచ్చజెండా ఊపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య బదిలీల కోసం పలువురు ఉద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు అంతరాష్ట్ర బదిలీల కోసం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకు 1338 మంది ఉద్యోగులు, ఏపీ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. జీఏడీ రాష్ట్ర పునర్విభజన […]
T20 World Cup: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ మరోసారి పాకిస్థాన్ జట్టుకు మెంటార్‌గా నియమితుడయ్యాడు. గత ఏడాది మాదిరిగానే పాకిస్థాన్ టీం మేనేజ్ మెంట్ టీ20 ప్రపంచకప్ మాథ్యూ హేడెన్‌ను సహాయక సిబ్బందిగా నియమించుకుంది. ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతరులతో కలిసి మెంటార్ బాధ్యతలను హేడెన్ పోషించనున్నాడు. రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో క్రికెటర్ అయిన హేడెన్.. బ్రిస్బేన్‌లో అక్టోబర్ 15న పాకిస్థాన్ జట్టుతో చేరనున్నాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో […]
Chennai man Worked in Three Companies: వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రెండు కంపెనీలలో పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నైలో ఓ వ్యక్తి ఒకే సమయంలో మూడు కంపెనీలలో ఉద్యోగాలను చేస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. శ్వేతా శంకర్ అనే మహిళ ర్యాపిడో బుక్ చేసుకోగా.. శంకర్ […]
Sean Abbott: ఆస్ట్రేలియా జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా జట్టు నిలకడలేమిని ప్రదర్శిస్తోంది. జింబాబ్వే చేతిలో వన్డేలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గొప్ప ప్రదర్శనే చేసింది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 195 పరుగులు మాత్రమే చేయగా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ బౌలర్ తన కెరీర్‌లోనే గొప్ప గణాంకాలను నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన […]
CM Jagan Review Meeting: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈఏపీ (ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూడెవలప్‌మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనుల్లో […]