Virat Kohli: అప్పుడు నేను తొండి ఆట ఆడాను.. అవుటైనా బ్యాటింగ్ చేశాను..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త జోష్‌లో కనిపిస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఆసియా కప్‌లో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఉత్తేజంగా ముందుకు సాగిపోతున్నాడు. మరోవైపు ట్విట్టర్‌లో 50 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నాడు. ట్విట్టర్ వేదికగా పలు యాడ్‌లను షేర్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నాడు. తాజాగా ఫుమా కంపెనీకి చెందిన ఓ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఈ వీడియోలో ఫుమా కంపెనీ గురించి కాకుండా తన చిన్ననాటి సంగతుల గురించి అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా చిన్నప్పుడు వాడిన కొన్ని క్రికెట్ పదాల గురించి కోహ్లీ తన వీడియోలో వివరించాడు.
Read Also: Ozone Depletion: ఓజోన్ లేయర్‌ను దెబ్బతీస్తున్న అయోడిన్.. పరిశోధనలో వెల్లడి.
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
చిన్నతనంలో గల్లీ క్రికెట్ ఆడుతూ బేబీ ఓవర్ అని పిలిచేవాళ్లమని.. ఎందుకంటే ఆ ఓవర్‌లో మూడు బంతులు మాత్రమే ఉండేవని కోహ్లీ తన వీడియోలో వివరించాడు. అంతేకాకుండా ట్రయల్ బాల్ కూడా బాగా వాడేవాళ్లమని తెలిపాడు. ఎవరైనా బ్యాటర్ తొలి బంతికే ఔటైనప్పుడు దానిని ట్రయల్ బాల్‌గా పిలిచేవాళ్లమని.. తాను చాలాసార్లు బేబీ ఓవర్లు, ట్రయల్ బాల్స్ ఆడినట్లు కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. గల్లీ క్రికెట్ ఆడే సమయంలో తాను తొండి ఆట ఆడేవాడినని.. తాను అవుటైతే ట్రయల్ బాల్ అంటూ రచ్చ చేసి మళ్లీ బ్యాటింగ్ చేసేవాడినని కోహ్లీ వివరించాడు. అయితే ఇప్పుడు గల్లీ క్రికెట్‌లో బేబీ ఓవర్ అన్న పదం వినిపించడం లేదన్నాడు. మరోవైపు బట్టా అనే పదం కూడా తాము వాడేవాళ్లమన్నాడు. బట్టా అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతుంటారని.. బంతిని విసరడం కోసం ఆ పదాన్ని పలుకుతారని చెప్పాడు. టెన్నిస్ బాల్‌ను కాస్త కఠినంగా విసిరితే బట్టా సంధించాడని అరిచేవాళ్లమని కోహ్లీ తెలిపాడు. అయితే ఈ పదాన్ని అప్పట్లో కొన్ని ప్రాంతాలలోనే వాడేవాళ్లు. మన తెలుగు రాష్ట్రాలలో బట్టా అనే పదం దాదాపుగా చాలా మందికి తెలియదు.
https://twitter.com/imVkohli/status/1570295580110491650
తాజావార్తలు
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!