Auto Driver: కేరళలోని ఓ ఆటోడ్రైవర్ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలో ఓనం పండగ సందర్భంగా తిరువోణం బంపర్ లాటరీని నిర్వహించారు. ఈ లాటరీలో తిరువనంతపురంలోని 32 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ రూ.25 కోట్ల మెగా బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ బహుమతుల విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా టికెట్ […]
Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరెన్ని వాదనలు చేసినా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్‌వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని.. తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నాడు. టీ20 ఫార్మాట్‌లో పాండ్యాకు తిరుగు లేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ఆసియా కప్‌లో […]
Tirumala Tirupati Devastanam: తిరుమలలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే అన్నదానం పేరుతో పలువురు భక్తులు భారీ స్థాయిలో విరాళాలను అందజేస్తున్నారు. కానీ కొందరు ప్రైవేట్ సంస్థలకు విరాళాలు అందిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు […]
Gujarat Titans: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్ ఐపీఎల్ సందర్భంగా గుజరాత్ జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. తమ జట్టుతో కొనసాగిన అతని ప్రయాణం అద్భుతమని ప్రశంసించింది. ‘శుభ్‌మన్ నీ ప్రయాణం గుర్తించుకోదగినది. నీ భవిష్యత్ మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’అని ట్వీట్ చేసింది. ఈ […]
Vijay Sai Reddy: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. హాలీవుడ్ మీడియా సైతం ఆర్.ఆర్.ఆర్ మూవీని కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆర్.ఆర్.ఆర్ మూవీని కొనియాడుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ […]
Maharashtra: ప్రస్తుత రోజుల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వాలు భారీగా నగదు వసూలు చేస్తున్నాయి. కానీ ఆ నగదును ప్రజల సౌకర్యాల కోసం వాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఓ గ్రామానికి అక్కడి ప్రభుత్వం కనీస సౌకర్యాలను కల్పించడంలో దారుణంగా విఫలం అవుతోంది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యను తీర్చలేదు. కానీ 19 ఏళ్ల యువతి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు చేయలేని పని చేసి […]
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు. చిరంజీవి దయతో ఈ స్థాయికి వచ్చిన పవన్ ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని.. తాను చాలా పునీతుడినని అన్నట్లు పవన్ మాటలు ఉన్నాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపించలేదని.. ఆనాడు […]
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌తో పాటు ట్రెండ్‌ను కూడా ఫాలో అవుతుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం విరాట్ కోహ్లీ మొహాలీ చేరుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ నెల 20న మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా మొహాలీ ఎయిర్‌పోర్టులో విరాట్ కోహ్లీ దిగిన ఫొటోలను పీసీఏ తన ట్విటర్‌లో పంచుకుంది. ఈ ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపించాడు. అతడి కొత్త […]
Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎం జగన్ అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించారని.. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఆ వివరాలు చూసుకుని ఏవైనా తప్పులుంటే టీడీపీ నేతలే చెప్పాలని హితవు పలికారు. కొన్ని […]
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా కానుకను అందించనుంది. ఏడో వేతన కమిషన్ ప్రకారం కేంద్రం త్వరలో డీఏ ప్రకటించనుందని ఓ నివేదిక ద్వారా స్పష్టమైంది. ఇప్పటికైతే అధికారికంగా వెల్లడి కాకపోయినా సెప్టెంబర్ చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో మరో 4 శాతం పెంచి మొత్తం 38 శాతానికి చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలో […]