Pegasus Row: ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు పెగాసస్‌పై హౌస్ కమిటీ సభ ముందు నివేదికను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డేటా చౌర్యం వ్యవహారంపై శాసనసభకు మధ్యంతర నివేదికను ఇచ్చింది. మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం సమర్పించింది. ఈ సందర్భంగా డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్‌కు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది. స్టేట్ డేటా సెంటర్ […]
Team India: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల ఆసియాకప్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో అందరి కళ్లు కోహ్లీ బ్యాటింగ్‌పైనే ఉన్నాయి. అయితే తాజాగా నెట్స్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియం పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తాడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఆసియా కప్‌లో బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా టోర్నీ […]
Ireland Old Woman: ఐర్లాండ్‌లో 66ఏళ్ల వృద్ధురాలు కొన్ని కారణాల వల్ల కలత చెంది ఆత్మహత్య చేసుకోవటానికి చేసిన పని అక్కడి డాక్టర్లకు చెమటలు పట్టించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ఏకంగా 55 బ్యాటరీలను మింగేసింది. దీంతో కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు వృద్ధురాలిని ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ మింగిన బ్యాటరీలలో AA, AAA బ్యాటరీలు ఉన్నాయి. తొలుత వైద్యులు మహిళ కడుపును ఎక్స్‌రే తీయగా ఇనుప […]
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా మౌనమే అని.. ఏపీలో గిరిజన మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు కలచి వేశాయని పవన్ అన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు అని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనే వాస్తవాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని వివరించారు. […]
Kanna Lakshmi Narayana: బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, భూ కుంభకోణాలతో జగన్ దోపిడీ వ్యవస్థను నడుపుతున్నారని తిరుపతిలో నిర్వహించిన ‘బీజేపీ ప్రజాపోరు వీధి సభ’లో కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. ఆయన అస్తవ్యస్త పాలనతో జనం విసిగిపోయారని ఆరోపించారు. వైసీపీ అసమర్థపరులపై తాము పోరాటం […]
T20 World Cup: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో బ్యాట్ పట్టబోతున్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ ఓపెనర్‌గా రాబోతున్నాడు. ఇదంతా నిజమా అని మీరు అనుకోకండి. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఇండియన్ టీమ్‌లోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఓ టీవీ యాంకర్ న్యూస్ చదువుతూ తడబడ్డాడు. ఇండియన్ టీమ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నట్లు […]
Inspiration in Eye Donation: తెలంగాణలో అదో చిన్న విలీన గ్రామం. హన్మకొండ జిల్లాలోని హసంపర్తి మండలంలో మారుమూలన ఉంది. అయితేనేం ఆ ఊరి ప్రజల మనసు మాత్రం ఎంతో విశాలం. గ్రామంలో ఎవరు చనిపోయినా వారి కుటుంబ సభ్యులు మృతుల కళ్ళను దానం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే గ్రామంలో 52 మందికి పైగా నేత్రాలను దానం చేశారు. ఎంతోమంది జీవితాల్లో ముచ్చర్ల గ్రామం వెలుగులు నింపుతోంది. ముచ్చర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఇంజనీర్ మండల రవీందర్ […]
Andhra Pradesh: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. ఈ మేరకు డేటా చౌర్యం అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా పెగాసస్ అంశంపై కమిటీ నివేదికను పెగాసస్ హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. చంద్రబాబు హయాంలో డేటా చౌర్యం జరిగిందని తాము నిర్ధారించినట్లు భూమన తెలిపారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ సభ ముందుకు పెగాసస్ కమిటీ నివేదిక […]
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తన యాత్రలో రాహుల్ గాంధీ చలాకీగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఏ మాత్రం అలసట లేకుండా ఆయన ముందుకు సాగిపోతున్నారు. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన కేరళలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తన పాదయాత్ర మధ్యలో దొరికిన విరామాన్ని ఉల్లాసంగా గడుపుతున్నారు. సోమవారం నాడు కేరళలో పర్యటిస్తున్న సందర్భంగా పున్నమాడ సరస్సులో జరిగిన స్నేక్ బోట్ […]
Bangladesh: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో రిటైర్మెంట్ల హవా నడుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్(32) టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో తన రిటైర్మెంట్ గురించి పోస్ట్ చేశాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని రూబెల్ హుస్సేన్ స్పష్టం చేశాడు. 2009లో వెస్టిండీస్‌తో తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడిన రూబెల్.. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ టెస్ట్ […]